Virat Kohli: బ్రాడ్‌మన్ రికార్డును కోహ్లి అధిగమిస్తాడా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడు కన్నేసిన రికార్డులు ఇవే
- Virat Kohli: బ్రాడ్‌మన్ రికార్డును కోహ్లి అధిగమిస్తాడా? డబ్ల్యూటీసీ ఫైనల్లో విరాట్ కొన్ని ఇతర రికార్డులపై కూడా కన్నేశాడు. వీటిలో ఇప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తోపాటు సచిన్ టెండూల్కర్ రికార్డులు కూడా ఉన్నాయి.
- Virat Kohli: బ్రాడ్‌మన్ రికార్డును కోహ్లి అధిగమిస్తాడా? డబ్ల్యూటీసీ ఫైనల్లో విరాట్ కొన్ని ఇతర రికార్డులపై కూడా కన్నేశాడు. వీటిలో ఇప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తోపాటు సచిన్ టెండూల్కర్ రికార్డులు కూడా ఉన్నాయి.
(1 / 6)
Virat Kohli: ఆస్ట్రేలియాతో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆల్ టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డుపై కోహ్లి కన్నేశాడు. టెస్టుల్లో 28 సెంచరీలు చేసిన విరాట్.. మరో సెంచరీ చేస్తే 29 సెంచరీలతో బ్రాడ్‌మన్ సరసన నిలుస్తాడు.(AP)
(2 / 6)
Virat Kohli: ఐసీసీ నాకౌట్ స్టేజ్‌లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన రికార్డు రికీ పాంటింగ్ పేరిట ఉంది. అతడు వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు కలిపి 18 నాకౌట్ మ్యాచ్ లు ఆడాడు. ఈ లిస్టులో యువరాజ్ 17 మ్యాచ్ లతో ఉండగా.. సచిన్, ధోనీలతో కలిసి 15 మ్యాచ్ లతో విరాట్ మూడోస్థానంలో ఉన్నాడు. ఈ ఫైనల్ తో సచిన్, ధోనీలను విరాట్ మించిపోనున్నాడు.(AP)
(3 / 6)
Virat Kohli: ఆస్ట్రేలియాపై 5 వేల అంతర్జాతీయ పరుగుల రికార్డుకు విరాట్ కోహ్లి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి 92 మ్యాచ్ లలో 4945 రన్స్ చేశాడు. ఈ ఫైనల్లో మరో 55 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాపై 5 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకుంటాడు.(AP)
(4 / 6)
Virat Kohli: ఇంగ్లండ్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా నిలవడానికి విరాట్ కోహ్లి 72 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో 46 మ్యాచ్ లలో 2645 రన్స్ తో రాహుల్ ద్రవిడ్ తొలిస్థానంలో ఉండగా.. సచిన్ 43 మ్యాచ్ లలో 2626 రన్స్ తో రెండోస్థానంలో, విరాట్ 56 మ్యాచ్ లలో 2574 రన్స్ తో మూడోస్థానంలో ఉన్నాడు.(AP)
(5 / 6)
Virat Kohli: ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలవడానికి విరాట్ కోహ్లి.. 112 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లి ప్రస్తుతం 620 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 14 మ్యాచ్ లలో 657 పరుగులు, రికీ పాంటింగ్ 18 మ్యాచ్ లలో 731 పరుగులు చేశారు.(AP)
ఇతర గ్యాలరీలు