Ugadi Traditional Foods । ఉగాది రోజున ఈ సాంప్రదాయ రుచులను తప్పక ఆస్వాదించాలి!-traditional foods to savour this ugadi 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Traditional Foods To Savour This Ugadi 2023

Ugadi Traditional Foods । ఉగాది రోజున ఈ సాంప్రదాయ రుచులను తప్పక ఆస్వాదించాలి!

Mar 21, 2023, 03:54 PM IST HT Telugu Desk
Mar 21, 2023, 03:54 PM , IST

Ugadi 2023 Traditional Foods: ఈ ఉగాది పర్వదినం సందర్భంగా తప్పకుండా చేసుకోవాల్సిన కొన్ని సాంప్రదాయ వంటకాలు, ఆస్వాదించాల్సిన పండగ రుచులు ఇక్కడ చూడండి.

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. ఈ పండుగ నాడు తప్పకుండా కొన్ని సాంప్రదాయ వంటకాలు చేసుకోవాలి, వాటి రుచులను ఆస్వాదించాలి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని ప్రజలు ఈ ఉగాది రోజున ఆస్వాదించే ఆహారాలు చూద్దాం.  

(1 / 7)

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. ఈ పండుగ నాడు తప్పకుండా కొన్ని సాంప్రదాయ వంటకాలు చేసుకోవాలి, వాటి రుచులను ఆస్వాదించాలి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని ప్రజలు ఈ ఉగాది రోజున ఆస్వాదించే ఆహారాలు చూద్దాం.  (Unsplash)

ఉగాది పచ్చడి: ఉగాది నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడిని తినాలి. ఇది తీపి, పులుపు, కారం, లవణం, చేదు, వగరు వంటి ఆరు రకాల రుచులను కలిగి ఉంటుంది. ప్రతి రుచి ఒక వ్యక్తి జీవితంలో అనుభవించే విభిన్న భావోద్వేగాలను సూచిస్తుంది.

(2 / 7)

ఉగాది పచ్చడి: ఉగాది నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడిని తినాలి. ఇది తీపి, పులుపు, కారం, లవణం, చేదు, వగరు వంటి ఆరు రకాల రుచులను కలిగి ఉంటుంది. ప్రతి రుచి ఒక వ్యక్తి జీవితంలో అనుభవించే విభిన్న భావోద్వేగాలను సూచిస్తుంది.(Unsplash)

బొబ్బట్టు, పోలెలు లేదా హోలిగే: బొబ్బట్టు అనేది బెల్లం, కొబ్బరి లేదా శనగ పప్పు పూరకంతో నింపి చేసే ఒక పరోటా లాంటి వంటకం. ఉగాది పండుగ సమయంలో ఇది ఒక ప్రసిద్ధ వంటకం. తరచుగా నెయ్యి లేదా పాలతో వడ్డిస్తారు. 

(3 / 7)

బొబ్బట్టు, పోలెలు లేదా హోలిగే: బొబ్బట్టు అనేది బెల్లం, కొబ్బరి లేదా శనగ పప్పు పూరకంతో నింపి చేసే ఒక పరోటా లాంటి వంటకం. ఉగాది పండుగ సమయంలో ఇది ఒక ప్రసిద్ధ వంటకం. తరచుగా నెయ్యి లేదా పాలతో వడ్డిస్తారు. (Unsplash)

పులిహోర:  సాధారణం ప్రతి పండగకు, శుభకార్యాలకు హిందువులు చింతపండు పులిహోరాను తప్పకుండా చేసుకుని తింటారు.

(4 / 7)

పులిహోర:  సాధారణం ప్రతి పండగకు, శుభకార్యాలకు హిందువులు చింతపండు పులిహోరాను తప్పకుండా చేసుకుని తింటారు.(Unsplash)

ఒబ్బట్టు సారు: ఇది బొబ్బట్లు చేయగా మిగిలిపోయిన ఫిల్లింగ్‌ని ఉపయోగించి  తయారు చేసే ఒక స్పైసీ సూప్. ఇది రుచికరమైనది, ఆరోగ్యకరమైనది.

(5 / 7)

ఒబ్బట్టు సారు: ఇది బొబ్బట్లు చేయగా మిగిలిపోయిన ఫిల్లింగ్‌ని ఉపయోగించి  తయారు చేసే ఒక స్పైసీ సూప్. ఇది రుచికరమైనది, ఆరోగ్యకరమైనది.(Unsplash)

మామిడి పచ్చడి: మామిడి పచ్చడి అనేది పండిన మామిడికాయలు, బెల్లం, మసాలా దినుసులతో తయారు చేసే ఒక చిక్కని చట్నీ. ఇది మామిడి పండు సీజన్‌లో ప్రసిద్ధి చెందిన వంటకం,అన్నంతో పాటు సైడ్ డిష్‌గా వడ్డిస్తారు.

(6 / 7)

మామిడి పచ్చడి: మామిడి పచ్చడి అనేది పండిన మామిడికాయలు, బెల్లం, మసాలా దినుసులతో తయారు చేసే ఒక చిక్కని చట్నీ. ఇది మామిడి పండు సీజన్‌లో ప్రసిద్ధి చెందిన వంటకం,అన్నంతో పాటు సైడ్ డిష్‌గా వడ్డిస్తారు.(Unsplash)

బిసి బేలే బాత్: బిసి బేలే బాత్ అనేది కూరగాయలు, పప్పులు,  సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే స్పైసీ రైస్ డిష్. ఇది కర్నాటకలో ఒక ప్రసిద్ధ వంటకం.  రైతా మరియు పాపడ్‌తో వడ్డిస్తారు.

(7 / 7)

బిసి బేలే బాత్: బిసి బేలే బాత్ అనేది కూరగాయలు, పప్పులు,  సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే స్పైసీ రైస్ డిష్. ఇది కర్నాటకలో ఒక ప్రసిద్ధ వంటకం.  రైతా మరియు పాపడ్‌తో వడ్డిస్తారు.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు