Cricket Fights: ఆటలో అవతలి వాడొస్తే అసలు తగ్గేదేలే.. క్రికెట్ చరిత్రలో ఘోరమైన ఫైట్లు ఇవే..!-top seven high voltage fights in cricket history ever ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top Seven High Voltage Fights In Cricket History Ever

Cricket Fights: ఆటలో అవతలి వాడొస్తే అసలు తగ్గేదేలే.. క్రికెట్ చరిత్రలో ఘోరమైన ఫైట్లు ఇవే..!

Apr 29, 2023, 10:40 AM IST Maragani Govardhan
Apr 29, 2023, 10:40 AM , IST

  • క్రికెట్‌ను మనదేశంలో ఓ మతంలా చూస్తారు. ఆటగాళ్లను దేవుళ్లుగా ఆరాధిస్తారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే అది ఆటలా కాకుండా ఓ యుద్ధంలా భావిస్తుంటారు. మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లు గొడవలు జరగడం సహజం. కొన్నిసార్లు ఇవి మితిమీరతాయి. అలా సీరియస్‌నెస్‌కు దారితీసిన టాప్-7 క్రికెట్ ఫైట్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

Pollard vs Starc: ఐపీఎల్ 2014లో బెంగళూరు-ముంబయి మధ్య జరిగిన మ్యాచ్‌లో పోలార్డ్-స్టార్క్ గొడవ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. ముంబయి ప్లేయర్ కీరన్ పోలార్డ్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్టార్క్ బౌలింగ్ చేస్తున్న సమయంలో పోలార్డ్ సిద్ధంగా లేకపోవడంతో వద్దంటూ చేయి అడ్డంగా చూపుతాడు. మరో సారి కూడా పోలార్డ్ అలాగే చేయడంతో విసుగు చెందిన స్టార్క్ బంతిని పోలార్డ్ వైపు బలంగా విసురుతాడు. ఇందుకు ప్రతిగా పోలార్డ్ కూడా బ్యాట్‌ను స్టార్క్ వైపు విసురుతాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇద్దరినీ అదుపు చేసేందుకు అంపైర్‌తో పాటు క్రిస్‌గేల్ కూడా వస్తారు. పోలార్డ్ విసిరిన బ్యాట్ స్టార్క్‌కు తగిలుంటే ఆ పరిణామం మరోలా ఉండేది.

(1 / 7)

Javed Miandad vs Dennis Lilly: ఈ ఫైట్ క్రికెట్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు ఫిజికల్‌ దాడికి దిగుతారు. పాకిస్థాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ పరుగులు తీస్తుండగా.. ఆస్ట్రేలియా లెజెండ్ డెన్నిస్ లిల్లీ అడ్డుగా వచ్చాడు. అప్పుడు జావెద్-డెన్నిస్ ఇద్దరూ ఒకరినొకరు నెట్టుకున్నారు. డెన్నీస్‌కు కోపం వచ్చి జావెద్‌పై దాడి చేశాడు. ఇందుకు సమాధానంగా జావెద్ మియాందాద్‌ కూడా బ్యాట్ పట్టుకొని కొట్టడానికి వెళ్లాడు. అనంతరం అంపైర్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాడు.

(2 / 7)

Javed Miandad vs Dennis Lilly: ఈ ఫైట్ క్రికెట్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు ఫిజికల్‌ దాడికి దిగుతారు. పాకిస్థాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ పరుగులు తీస్తుండగా.. ఆస్ట్రేలియా లెజెండ్ డెన్నిస్ లిల్లీ అడ్డుగా వచ్చాడు. అప్పుడు జావెద్-డెన్నిస్ ఇద్దరూ ఒకరినొకరు నెట్టుకున్నారు. డెన్నీస్‌కు కోపం వచ్చి జావెద్‌పై దాడి చేశాడు. ఇందుకు సమాధానంగా జావెద్ మియాందాద్‌ కూడా బ్యాట్ పట్టుకొని కొట్టడానికి వెళ్లాడు. అనంతరం అంపైర్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాడు.(ESPN Cricinfo)

Harbhajan vs Shoaib Akhtar: 2010 ఆసియా కప్‌లో టీమిండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ గొడవ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ చివరి 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు అక్తర్.. హర్భజన్ సింగ్‌ కఠినమైన బంతిని సంధిస్తాడు. అంతేకాకుండా భజ్జీని రెచ్చగొడతాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అనంతరం చివరి ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన మహమ్మద్ అమీర్ బౌలింగ్‌లో ఐదో బంతికి సిక్సర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందిస్తాడు భజ్జీ. హర్భజన్ సంబరాలను చూడలేకపోయిన అక్తర్ సిగ్గుపడుతూ స్టేడియం నుంచి బయటకు వెళ్తాడు.

(3 / 7)

Ishant Sharma vs Akmal: 2012లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ గొడవ జరిగింది. ఇషాంత్ శర్మ వేసిన నో బాల్‌లో కమ్రాన్ అక్మల్ ఔట్ అవుతాడు. వెంటనే ఇద్దరూ ఒకరినొకరు వెక్కిరించుకుంటారు. ఇషాంత్.. అక్మల్ వైపు వేగంగా వెళ్లగా.. అతడు కూడా అదే రీతిలో స్పందిస్తాడు. వెంటనే సహచర ఆటగాళ్లతో పాటు అంపైర్ కూడా వచ్చి వీరిద్దరి గొడవను సద్దుమణిగిస్తారు.

(4 / 7)

Ishant Sharma vs Akmal: 2012లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ గొడవ జరిగింది. ఇషాంత్ శర్మ వేసిన నో బాల్‌లో కమ్రాన్ అక్మల్ ఔట్ అవుతాడు. వెంటనే ఇద్దరూ ఒకరినొకరు వెక్కిరించుకుంటారు. ఇషాంత్.. అక్మల్ వైపు వేగంగా వెళ్లగా.. అతడు కూడా అదే రీతిలో స్పందిస్తాడు. వెంటనే సహచర ఆటగాళ్లతో పాటు అంపైర్ కూడా వచ్చి వీరిద్దరి గొడవను సద్దుమణిగిస్తారు.(ESPN Cricinfo)

Gautam Gambhir vs Shahid Afridi: భారత్-పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య జరిగిన అతిపెద్ద గొడవ ఇదే. ఈ ఘటన తర్వాత గంభీర్-షాహీద్ అఫ్రిదీపై జరిమానా విధిస్తారు. గంభీర్ పరుగు తీసేందుకు ప్రయత్నించినప్పుడు అఫ్రిదీ అతడికి అడ్డుగా వస్తాడు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అంపైర్ జోక్యం చేసుకున్నప్పటికీ వీరిద్దరూ అసలు శాంతించరు. ఫలితంగా ఇరువురిపై జరిమానా విధిస్తారు మ్యాచ్ రిఫరీ.

(5 / 7)

Moin Khan vs team India: 1983లో భారత్-పాకిస్థాన్ మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుంది. భారత బౌలర్లు పాక్ స్కోరును డ్రా చేసేందుకు ప్రయత్నించారు. బ్యాటింగ్ చేస్తున్న మోహ్సిన్ ఖాన్‌ను వారు బౌన్సర్లతో ఇబ్బంది పెడతారు. దీంతో వాటిని ఎదుర్కోలేక మొహ్సిన్ ఖాన్ కోపం తెచ్చుకుంటాడు. 3 వికెట్లలో ఒకదాన్ని తొలగించి ఇక బౌలింగ్ చేయమని ఆదేశిస్తాడు. దీంతో ఇరుజట్ల మధ్య గొడవ జరుగుతుంది.

(6 / 7)

Virat kohli vs Gautam Gambhir: 2013 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్ మధ్య గొడవ జరుగుతుంది. కోహ్లీ మొదటి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాగా.. ఆ తర్వాత 3వ బంతిని కూడా సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించి ఔట్ అవుతాడు. అప్పుడు గంభీర్.. కోహ్లీని ఏదో అంటాడు. దీంతో విరాట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపైకి వెళ్తాడు. గంభీర్ కూడా ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తాడు. ఈ సంఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి విరాట్-గంభీర్ మధ్య చిచ్చు రేగుతూనే ఉంది.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు