Terrace Garden in Summer । వేసవిలో మీ టెర్రస్ పైన మొక్కలను ఇలా సంరక్షించండి!-tips to take care of your terrace garden in hot summer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tips To Take Care Of Your Terrace Garden In Hot Summer

Terrace Garden in Summer । వేసవిలో మీ టెర్రస్ పైన మొక్కలను ఇలా సంరక్షించండి!

Apr 21, 2023, 08:22 PM IST HT Telugu Desk
Apr 21, 2023, 08:22 PM , IST

Terrace Garden in Summer: ఇంటి డాబా మీద అందమైన గార్డెన్ ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఆకుపచ్చని మొక్కలు, రంగురంగుల పూలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ ఈ మండు వేసవి మొక్కలు వాడిపోయేలా చేస్తుంది. వేడి నుండి మొక్కలను ఎలా రక్షించుకోవాలో ఇక్కడ చూడండి.

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటాయి. మండుటెండలకు మొక్కలు కూడా తాలలేవు. ఆకులు రాలిపోవడం, పువ్వులు వాడిపోవడం, మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. వేసవిలో మీ ఇంట్లోని మొక్కలను ఎలా కాపాడుకోవాలో చూడండి. 

(1 / 5)

వేసవిలో నీటి కొరత కారణంగా మొక్కలకు ఎండిపోతాయి. కాబట్టి టెర్రస్ మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండుసార్లు నీరు పెట్టాలి. ఎండవేడి, కలుషితమైన నీరు మొక్కల అడుగుభాగాన్ని తాకకుండా చూసుకోండి. 

(2 / 5)

చిన్న పైపు లేదా స్ప్రే బాటిల్‌తో మొక్కలకు నీరు అందేలా చూడండి. ఇది మొక్కలను పునరుజ్జీవింపజేస్తుంది, ఆకులు రాలడం తగ్గుతుంది. 

(3 / 5)

రోజుకు రెండుసార్లు నీరు పోసినా మొక్క ఎండిపోయినట్లయితే, మొక్కలను నీడ ఉన్న ప్రాంతంలోకి తరలించండి లేదా షెడ్‌ను ఏర్పాటు చేయండి. వీలైతే టార్పాలిన్ తెచ్చి మూత పెట్టండి. 

(4 / 5)

వేసవిలో మొక్కలకు  వేసే ఎరువుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో సేంద్రియ ఎరువులకు బదులుగా రసాయనిక ఎరువులు వాడవచ్చు. సేంద్రీయ ఎరువులు వేసినప్పుడు, అవి నేలలోకి వెళ్లి వేడిని ఉత్పత్తి చేస్తాయి. బదులుగా రసాయనిక ఎరువులను నీటిలో కలిపి ఆకులపై పిచికారీ చేయండి. అయితే మితంగా వేయండి. ఈ రకంగా చీడపీడల బెడద కూడా చాలా వరకు తగ్గుతుంది.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు