(1 / 5)
నికోల్ కిడ్‌మన్ హీరోయిన్‌గా నటించిన ది అదర్స్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మనుషులను చూసి భయపడే ఓ దయ్యం కథతో తెరకెక్కిన ఈ మూవీలో ట్విస్ట్‌లు ఆదిరిపోతాయి. ఈ సినిమా కథ మొత్తం ఓ బిల్డింగ్ లోనే నడుస్తుంది.
(2 / 5)
డేవిండ్ ఫించర్ దర్శకత్వం వహించిన పానిక్ రూమ్ కమర్షియల్‌గా హిట్టైంది. ఈ థ్రిల్లర్ మూవీ కథ మొత్తం ఒకే రూమ్‌లో సాగుతుంది. పానిక్ రూమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
(3 / 5)
అమెరికన్ ట్రక్ డ్రైవర్‌ను బతికుండానే శవపేటికలో బంధించి పాతేస్తారు ఇరాక్ టెర్రరిస్ట్‌లు. ఆ శవ పేటిక నుంచి ట్రక్ డ్రైవర్ ఎలా బయటపడ్డాడనే పాయింట్‌తో బ్యురీడ్ మూవీ తెరకెక్కింది. సినిమా కథ మొత్తం శవపేటిక చుట్టే తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని చూడొచ్చు.
(4 / 5)
సైకో కారణంగా సెల్లార్ పార్కింగ్‌లో చిక్కుకుపోయిన ఓ యువతి అక్కడి నుంచి ఎలా బయటపడిందనే పాయింట్‌తో పీ2 మూవీ తెరకెక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
(5 / 5)
2002లో వచ్చిన ఫోన్‌బూత్ మూవీని డిస్నీ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఈ సినిమా కథ మొత్తం ఒకే ఫోన్ బూత్‌లోనే నడుస్తుంది.
ఇతర గ్యాలరీలు