Jodo Yatra in Telangana: తిరిగి ప్రారంభమైన జోడో యాత్ర… డోలు వాయించిన రాహుల్-rahul gandhi bharat jodo yatra restarted from maktal in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rahul Gandhi Bharat Jodo Yatra Restarted From Maktal In Telangana

Jodo Yatra in Telangana: తిరిగి ప్రారంభమైన జోడో యాత్ర… డోలు వాయించిన రాహుల్

Oct 27, 2022, 12:42 PM IST HT Telugu Desk
Oct 27, 2022, 12:42 PM , IST

  • Bharat Jodo Yatra in Telangana: తెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర దీపావళి నేపథ్యంలో నాలుగు రోజుల విరామం అనంతరం గురువారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రలో పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 

గురువారం ఉదయం తెలంగాణలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర మళ్లీ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్‌ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభించారు. మధ్యలో మక్తల్ పెద్ద చెరువు వద్ద  పలు సంఘాలతో పాటు కార్మికులను రాహుల్ గాంధీ కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

(1 / 5)

గురువారం ఉదయం తెలంగాణలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర మళ్లీ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్‌ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభించారు. మధ్యలో మక్తల్ పెద్ద చెరువు వద్ద పలు సంఘాలతో పాటు కార్మికులను రాహుల్ గాంధీ కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.(twitter)

మక్తల్‌ శివారులోని సబ్‌ స్టేషన్‌ నుంచి రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభం కాగా…  యాదవ సంఘాలు రాహుల్ గాంధీని కలిశాయి. ఈ సందర్భంగా డోలు వాయించారు రాహుల్ గాంధీ.

(2 / 5)

మక్తల్‌ శివారులోని సబ్‌ స్టేషన్‌ నుంచి రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభం కాగా… యాదవ సంఘాలు రాహుల్ గాంధీని కలిశాయి. ఈ సందర్భంగా డోలు వాయించారు రాహుల్ గాంధీ. (twitter)

గురువారం ఉదయం బండ్లగుంటకు చేరుకున్నాక పాదయాత్ర ముగిసింది. భోజన విరామం సమయంలో రైతు సమస్యలపై రాహుల్‌ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి యాత్ర మళ్లీ మొదలవుతుంది.  రాత్రికి గుడిగండ్ల వద్ద ముగుస్తుంది. గుడిగండ్ల కూడలి సమావేశంలో రాహుల్‌గాంధీ పాల్గొంటారు. ఇవాళ రాత్రి ఎలిగండ్లలో బస చేస్తారు.

(3 / 5)

గురువారం ఉదయం బండ్లగుంటకు చేరుకున్నాక పాదయాత్ర ముగిసింది. భోజన విరామం సమయంలో రైతు సమస్యలపై రాహుల్‌ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి యాత్ర మళ్లీ మొదలవుతుంది. రాత్రికి గుడిగండ్ల వద్ద ముగుస్తుంది. గుడిగండ్ల కూడలి సమావేశంలో రాహుల్‌గాంధీ పాల్గొంటారు. ఇవాళ రాత్రి ఎలిగండ్లలో బస చేస్తారు.(twitter)

తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతుంది. అనంతరం నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరికొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు.

(4 / 5)

తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతుంది. అనంతరం నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరికొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు.

తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన పాదయాత్ర, నారాయణ్ పేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్ర నగర్, బహుదూర్ పుర, చార్మినార్, గోషా మహల్, నాంపల్లి, ఖైతరాబాద్, కూకట్ పల్లి, శేరిలింగపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగనుంది.  ఇక నగరంలో ఆరాంఘర్, చార్మినార్, మోజాంజాహి మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట, పెద్ద శంకరం పేట, మద్కూర్ మీదుగా కొనసాగనుంది.

(5 / 5)

తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన పాదయాత్ర, నారాయణ్ పేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్ర నగర్, బహుదూర్ పుర, చార్మినార్, గోషా మహల్, నాంపల్లి, ఖైతరాబాద్, కూకట్ పల్లి, శేరిలింగపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగనుంది. ఇక నగరంలో ఆరాంఘర్, చార్మినార్, మోజాంజాహి మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట, పెద్ద శంకరం పేట, మద్కూర్ మీదుగా కొనసాగనుంది.(twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు