
(1 / 9)
కేజీఎఫ్‌తో పాన్ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన ఐదో సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే భారీ స్థాయిలో ప్రకటించాల్సిన ఈ వార్తను.. సదరు చిత్ర నిర్మాత ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఆ హీరోతో పాటు టైటిల్ వినగానే సిని ప్రియులు థిల్ అవుతున్నారు.
(PC: Hombale films)
(2 / 9)
2014లో ఉగ్రం అనే కన్నడ సినిమాతో చిత్రసీమంలో అరంగేట్రం చేసిన ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత కేజీఎఫ్‌తో భారీ హిట్ అందుకున్నారు.

(3 / 9)
తొలి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ చిత్రాన్ని టేకాఫ్ చేసి ఆ చిత్రంతో పాన్ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నాడు. హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. అనంతరం కేజీఎఫ్-2 కూడా అఖండ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

(4 / 9)
కేజీఎఫ్-2 తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్‌ను పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.

(5 / 9)
అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్‌టీఆర్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(6 / 9)
ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో సదరు నిర్మాతే ఈ విషయాన్ని ప్రకటించారు. తన తదుపరి మూడు సినిమాలను ప్రకటించిన దిల్ రాజు.. అందులో ప్రశాంత్ నీల్‌తో సినిమా కూడా ఉంటుందని తెలిపారు.

(7 / 9)
దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

(8 / 9)
ఇప్పటికే సలార్ చిత్రంతో ప్రభాస్-ప్రశాంత్ నీల్ సందడి చేయనున్నారు. మరోసారి డార్లింగ్‌తో ప్రశాంత్ నీల్ పనిచేయబోతున్నట్లు దిల్ రాజు ప్రకటనతో తెలుస్తోంది.

(9 / 9)
దిల్ రాజు నిర్మాతగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. రావణం అనే పేరును ఖరారు చేశారు.
ఇతర గ్యాలరీలు