Nara Lokesh Padayatra: 1000 కి మీ పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర-nara lokesh completes 1000 km of yuvagalam padayatra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Nara Lokesh Completes 1000 Km Of Yuvagalam Padayatra

Nara Lokesh Padayatra: 1000 కి మీ పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర

Apr 21, 2023, 05:44 PM IST HT Telugu Desk
Apr 21, 2023, 05:44 PM , IST

  • Lokesh Yuvagalam padayatra Updates: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం పాదయాత్ర’ 1000 కి.మీ మైలురాయి చేరుకుంది. ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. 

ఆదోని శివారు క్యాంప్ సైట్ నుంచి 77వరోజు లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంది. 

(1 / 7)

ఆదోని శివారు క్యాంప్ సైట్ నుంచి 77వరోజు లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంది. (twiiter)

ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలచిన యువగళం సైనికులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. 

(2 / 7)

ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలచిన యువగళం సైనికులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. (twiiter)

 ఆదోని టౌన్‌లోకి చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు.లోకేశ్ ను  చూసేందుకు స్థానికంగా ఉండే మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు.

(3 / 7)

 ఆదోని టౌన్‌లోకి చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు.లోకేశ్ ను  చూసేందుకు స్థానికంగా ఉండే మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు.(twiiter)

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని,  పన్నుల భారంతో బతుకు భారంగా మారిందని లోకేశ్ కు పలువురు మహిళలు విన్నవించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మహిళలకు లోకేశ్ భరోసానిచ్చారు. 

(4 / 7)

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని,  పన్నుల భారంతో బతుకు భారంగా మారిందని లోకేశ్ కు పలువురు మహిళలు విన్నవించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మహిళలకు లోకేశ్ భరోసానిచ్చారు. (twiiter)

పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ను  ఆదోని బైపాస్ బాధితులు కలిసి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన లోకేశ్…  ఆదోని బైపాస్ రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తామని హామీనిచ్చారు. 

(5 / 7)

పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ను  ఆదోని బైపాస్ బాధితులు కలిసి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన లోకేశ్…  ఆదోని బైపాస్ రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తామని హామీనిచ్చారు. (twiiter)

 ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ వాసి అయినప్పటికీ ఈ ప్రాంతంపై ఆయనకు ప్రేమ లేదని లోకేశ్ విమర్శించారు. ఓట్లపై తప్ప సీమ ప్రజలపై సీఎంకు ధ్యాస లేదని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి గుక్కెడు నీళ్లు ఇచ్చేందుకు చేతులు కూడా రావడం లేదని దుయ్యబట్టారు. .

(6 / 7)

 ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ వాసి అయినప్పటికీ ఈ ప్రాంతంపై ఆయనకు ప్రేమ లేదని లోకేశ్ విమర్శించారు. ఓట్లపై తప్ప సీమ ప్రజలపై సీఎంకు ధ్యాస లేదని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి గుక్కెడు నీళ్లు ఇచ్చేందుకు చేతులు కూడా రావడం లేదని దుయ్యబట్టారు. .(twiiter)

అప్పర్ భద్ర డ్యామ్ ను కర్ణాటక నిర్మిస్తే రాయలసీమ ఎడారి అవుతుందన్నారు లోకేశ్ . ఈ అంశంపై జగన్ కనీసం స్పందించడం కూడా లేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో పరిశ్రమలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వేదవతి ప్రాజెక్టు కెపాసిటీని వైసీపీ ప్రభుత్వం 4 టీఎంసీలకు తగ్గించిందని… టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కెపాసిటీని 8 టీఎంసీలకు పెంచుతామని స్పష్టం చేశారు.

(7 / 7)

అప్పర్ భద్ర డ్యామ్ ను కర్ణాటక నిర్మిస్తే రాయలసీమ ఎడారి అవుతుందన్నారు లోకేశ్ . ఈ అంశంపై జగన్ కనీసం స్పందించడం కూడా లేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో పరిశ్రమలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వేదవతి ప్రాజెక్టు కెపాసిటీని వైసీపీ ప్రభుత్వం 4 టీఎంసీలకు తగ్గించిందని… టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కెపాసిటీని 8 టీఎంసీలకు పెంచుతామని స్పష్టం చేశారు.(twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు