Mahabubnagar IT Park : మహబూబ్‌నగర్‌లోని 'ఐటీ టవర్' రెడీ... ప్రత్యేకతలివే-mahabubnagar it tower inauguration on 6th may 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mahabubnagar It Tower Inauguration On 6th May 2023

Mahabubnagar IT Park : మహబూబ్‌నగర్‌లోని 'ఐటీ టవర్' రెడీ... ప్రత్యేకతలివే

May 05, 2023, 04:43 PM IST HT Telugu Desk
May 05, 2023, 04:43 PM , IST

  • Mahabubnagar IT Park Updates: మహబూబ్‌నగర్‌ సమీపంలో దివిటిపల్లిలో ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మే 6వ తేదీన మంత్రి కేటీఆర్ ఈ ఐటీ టవర్ ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్య విషయాలు ఏంటో చూద్దాం…..

ద్వితీయశ్రేణి నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ సేవల విస్తరణ లక్ష్యంగా  ముందుకు సాగుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఐటీ సేవలను ప్రారంభించనున్నారు. ఫలితంగా ఉపాధికల్పనపై నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే  ప్రభుత్వం… వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్ధిపేటలో  ఈ తరహా ఐటీ టవర్ లను ప్రారంభించింది.

(1 / 5)

మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి వద్ద 2018 జులై 7న ఈ ఐటీ టవర్ కు శంకుస్థాపన చేసింది ప్రభుత్వం. ఐటీ, మల్టీపర్పస్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. యువతకు ఉపాధి కల్పన కోసం 5 ఎకరాల్లో చేపట్టిన ఐటీ టవర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ టవర్‌లో సంస్థల ఏర్పాటుకు అమెరికా, లండన్‌కు చెందిన సంస్థలు ముందుకొచ్చినట్లు ప్రభుత్వం  ప్రకటించింది.

(2 / 5)

40 కోట్ల రూపాయలతో నాలుగు అంతస్థుల్లో ఈ ఐటీ టవర్ ను నిర్మించారు.  19 వేల 370 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. పారిశ్రామికవాడ పనులు పూర్తైతే 100కు పైగా ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. 

(3 / 5)

నాలుగేళ్ల పాటు స్థానికులకు ఏటా 10 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పరోక్షంగా మరో 10 వేల మందికి ఇక్కడ ఉపాధి లభించే అవకాశముందని అంచనా వేస్తోంది. ఈ టవర్ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

(4 / 5)

తొలి ఏడాదిలో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు 18 సంస్థలు ముందుకొచ్చినప్పటికీ… ఇప్పటి వరకు ఏ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఐటీ టవర్‌ అందుబాటులోకి రావడం వల్ల సాప్ట్‌వేర్‌ సంస్థలు కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవం సందర్భంగా  ఏర్పాటు చేయనున్న మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు