తెలుగు న్యూస్ / ఫోటో /
Aparna Das Wedding Photos: ఆదికేవశ హీరోయిన్‌ను పెళ్లాడిన మంజుమ్మల్ బాయ్స్ హీరో - పెళ్లి ఫొటోలు వైరల్
Aparna Das Wedding Photos: తమిళ హీరోయిన్, బీస్ట్ ఫేమ్ అపర్ణదాస్ పెళ్లిపీటలెక్కింది. మంజుమ్మల్ బాయ్స్ హీరో దీపక్ పరంబోల్‌తో ఏడడుగులు వేసింది. బుధవారం ఈ జంట పెళ్లి జరిగింది.
(1 / 5)
దీపక్ పరంబోల్, అపర్ణదాస్ పెళ్లి బుధవారం (ఏప్రిల్ 24న) కేరళలోని గురువాయూర్ టెంపుల్‌లో నిరాడంబరంగా జరిగింది. ఈ జంట పెళ్లి వేడుకలో కుటుంబసభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం.
(2 / 5)
అపర్ణదాస్, దీపక్ పరంబోల్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ పెళ్లి ఫొటోల్లో ట్రెడిషనల్ లుక్‌లో దీపక్, అపర్ణ కనిపిస్తున్నారు.
(3 / 5)
దళపతి విజయ్ బీస్ట్ మూవీతో నటిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అపర్ణదాస్, దాదా మూవీతో హీరోయిన్‌గా పెద్ద హిట్ అందుకున్నది. మనోహరం, ప్రియన్ ఒట్టత్తిల్లాను, సీక్రెట్ హోమ్‌తో పాటు మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది అపర్ణదాస్.
(4 / 5)
తెలుగులోనూ వైష్ణవ్‌తేజ్ హీరోగా నటించిన ఆదికేశవలో కీలక పాత్ర చేసింది అపర్ణదాస్. తెలుగులో ఆమె చేసిన ఒకే ఒక మూవీ ఇది.
ఇతర గ్యాలరీలు