US tornado today : ఇది టోర్నెడో సృష్టించిన విలయం.. 26మంది బలి!-in pics havoc created by mississippi tornado and storm 26 killed ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Havoc Created By Mississippi Tornado And Storm 26 Killed

US tornado today : ఇది టోర్నెడో సృష్టించిన విలయం.. 26మంది బలి!

Mar 26, 2023, 07:40 AM IST Sharath Chitturi
Mar 26, 2023, 07:40 AM , IST

US tornado today : అమెరికా మిస్సిసిప్పి ప్రాంతంలో టోర్నెడో​ సృష్టించిన విలయానికి ఇప్పటివరకు 26మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. టోర్నెడో బాధిత ప్రాంతాలను ఆదుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ హామీనిచ్చారు.

టోర్నెడో ప్రారంభానికి ముందు తీసిన చిత్రం ఉది. మిస్సిసిప్పి ప్రాంతంవైపు దూసుకెళ్లిన ఈ టోర్నెడో.. బీభత్సం సృష్టించింది.

(1 / 9)

టోర్నెడో ప్రారంభానికి ముందు తీసిన చిత్రం ఉది. మిస్సిసిప్పి ప్రాంతంవైపు దూసుకెళ్లిన ఈ టోర్నెడో.. బీభత్సం సృష్టించింది.(TWITTER)

టోర్నెడో ప్రభావం రోల్లింగ్​ ఫోర్క్​ ప్రాంతంపై అధికంగా పడింది. అక్కడి ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాహనాలు తిరగబడ్డాయి. చెట్లు నేలకూలాయి.

(2 / 9)

టోర్నెడో ప్రభావం రోల్లింగ్​ ఫోర్క్​ ప్రాంతంపై అధికంగా పడింది. అక్కడి ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాహనాలు తిరగబడ్డాయి. చెట్లు నేలకూలాయి.

‘నా నగరం నాశనం అయ్యింది. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది’ అని రోల్లింగ్​ ఫోర్క్​ మేయర్​ ఎల్డ్రిజ్​ వాల్కర్​ ఆందోళన వ్యక్తం చేశారు.

(3 / 9)

‘నా నగరం నాశనం అయ్యింది. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది’ అని రోల్లింగ్​ ఫోర్క్​ మేయర్​ ఎల్డ్రిజ్​ వాల్కర్​ ఆందోళన వ్యక్తం చేశారు.(TWITTER)

టోర్నెడో కోసం తాము సిన్నద్ధమవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. అందుకే ప్రభావం అనుకున్న దాని కన్నా తీవ్రంగా ఉందన్నారు.

(4 / 9)

టోర్నెడో కోసం తాము సిన్నద్ధమవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. అందుకే ప్రభావం అనుకున్న దాని కన్నా తీవ్రంగా ఉందన్నారు.(TWITTER)

రోల్లింగ్​ ఫోర్క్​ను టోర్నెడో విడిచిపెట్టి వెళ్లిపోయింది. కానీ అక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

(5 / 9)

రోల్లింగ్​ ఫోర్క్​ను టోర్నెడో విడిచిపెట్టి వెళ్లిపోయింది. కానీ అక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.(AP)

టోర్నెడో సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

(6 / 9)

టోర్నెడో సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.(TWITTER)

ఇది ఒక్కప్పటి పార్క్​.. ఇప్పుడు టోర్నెడో తీసుకొచ్చిన చెత్తతో నిండిపోయింది.

(7 / 9)

ఇది ఒక్కప్పటి పార్క్​.. ఇప్పుడు టోర్నెడో తీసుకొచ్చిన చెత్తతో నిండిపోయింది.(AP)

మిస్సిసిప్పి ప్రాంతాన్ని ఆదుకుంటామని జో బైడెన్​ హామీనిచ్చారు. అక్కడి పరిస్థితులు తనని కలచివేసినట్టు తెలిపారు.

(8 / 9)

మిస్సిసిప్పి ప్రాంతాన్ని ఆదుకుంటామని జో బైడెన్​ హామీనిచ్చారు. అక్కడి పరిస్థితులు తనని కలచివేసినట్టు తెలిపారు.(AP)

టోర్నెడో అనంతరం పరిస్థితులను చక్కదిద్దేందుకు అత్యవసర బృందాలు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రాంతంలో సాధారణ జీవనం పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని తెలుస్తోంది.

(9 / 9)

టోర్నెడో అనంతరం పరిస్థితులను చక్కదిద్దేందుకు అత్యవసర బృందాలు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రాంతంలో సాధారణ జీవనం పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని తెలుస్తోంది.(AP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు