Indian Women Gold Medalists: మహిళలు మహారాణులు.. పసిడి పట్టిన పౌరుషం-here the full details of indian women gold medalists in commonwealth games 2022 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Full Details Of Indian Women Gold Medalists In Commonwealth Games 2022

Indian Women Gold Medalists: మహిళలు మహారాణులు.. పసిడి పట్టిన పౌరుషం

Aug 09, 2022, 08:06 AM IST Maragani Govardhan
Aug 09, 2022, 08:06 AM , IST

  • Commonwealth Games 2022: బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సహా మొత్తం 61 పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఇందులో వచ్చిన 22 గోల్డ్ మెడల్స్‌లో 9 పతకాలు మహిళలు సాధించినవే ఉన్నాయి. పురుషులకు దీటుగా పౌరుషాన్ని ప్రదర్శించి పసిడి పట్టిన మహిళల గురించి ఇప్పుడు చూద్దాం.

ఈ జాబితాలో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ముందు వరుసలో ఉంది. 49 కేజీల విభాగంలో మొత్తం 201 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించింది. స్నాచ్‌లో 88, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కిలోలతో మొత్తం 201 కేజీలు ఎత్తింది. మహిళల 55 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ బిండియా రాణి దేవి రజతాన్ని కైవసం చేసుకుంది.

(1 / 10)

2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ ఈ కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణాన్ని అందుకుంది. 62 కేజీల విభాగంలో కెనడాకు చెందిన అనా గోడినేజ్‌ను ఓడించింది ఈ మెడల్‌ను సాధించింది.

(2 / 10)

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బంగారు పతకాన్ని ఒడిసి పట్టుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలను(2014, 2018లోనూ స్వర్ణం) సాధించిన ఏకైక వెయిట్ లిఫ్టర్‌గా రికార్డు సృష్టించింది. 53 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో శ్రీలంకకు చెందిన చమోదయ కేశనిపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వినేష్ 4-0 తేడాతో గెలిచింది.

(3 / 10)

పారా టేబుల్ టెన్నిస్‌లో భావిన హస్ముక్ భాయ్ పటేల్ బంగారు పతకంతో సత్తా చాటింది. ఫైనల్లో నైజీరియాకు చెందిన క్రిస్టియానను మూడు వరుస గేమ్స్‌ల్లో 12-10, 11-2. 11-9 తేడాతో ఓడించింది స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.

(4 / 10)

టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆచంట శరత్ కమల్, శ్రీజ ఆకుల జోడీ పసిడిని కైవసం చేసుకుంది. ఫైనల్‍‌లో ఈ ద్వయం 11-4, 9-11, 11-5, 11-6 తేడాతో మలేసియాకు చెందిన జావెన్ చుంగ్, కరెన్ లీన్‌లను ఓడించింది. 4-1 తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

(5 / 10)

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాన్ని సాధించాలనే కలను ఈ పోటీలతో తీర్చుకుంది. 2022 కామన్వెల్త్ పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో కెనడాకు చెందిన మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది. సింధు 2014లో కాంస్యం, 2018లో రజతం సాధించింది.

(6 / 10)

ఈ ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా అవతరించిన నిఖత్ జరీన్.. కామన్వెల్త్ గేమ్స్‌లోనూ సత్తా చాటింది. మహిళల 48-50 కేజీల విభాగంలో నిఖత్ ఐర్లాండ్‌కు చెందిన కార్లీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణాన్ని సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్‌కు ఇదే తొలి పతకం.

(7 / 10)

మహిళల 45-48 కేజీల విభాగంలో నీతూ సంఘాస్ స్వర్ణాన్ని అందుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన డెమీ జాడేను ఓడించి పసిడిని కైవసం చేసుకుంది. నీతూ తొలిసారి ఈ పతకాన్ని సాధించింది. 2017, 2018 యూత్ వరల్డ్ కప్‌లోనూ ఈ బాక్సర్ పసిడి పతకాలను సాధించింది.

(8 / 10)

బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ సాక్షిగా భారత మహిళల లాన్ బౌల్స్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఫైనల్లో 17-10 తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి పసిడిని సొంతం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో భారత్ పతకం సాధించడం 92 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. లవ్లీ చౌబై, పింకీ, నయన్ మోనీ సైకియా, రూపా రాణి లాన్ బౌల్స్ టీమ్‌లో సభ్యులు

(9 / 10)

భారత బంగారు బొమ్మలు.. పసిడితో భారత పతాకాన్నిరెపరెపలాడించిన వనితలు

(10 / 10)

భారత బంగారు బొమ్మలు.. పసిడితో భారత పతాకాన్నిరెపరెపలాడించిన వనితలు

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు