10 stocks to buy in 2023: న్యూ ఇయర్‌కు హెచ్‌డీఎఫ్‌సీ 10 స్టాక్ రెకెమెండేషన్స్
10 stocks to buy in 2023: బ్రోకరేజ్, రీసెర్చ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ 2023లో కొనుగోలు చేసేందుకు 10 స్టాక్స్ రెకమెండ్ చేసింది. వాటిలో ఏసీసీ, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, సీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, ఎల్ అండ్ టీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్‌బీఐ, జెన్సార్, పీఎన్సీ తదితర స్టాక్స్ ఉన్నాయి.
(1 / 10)
భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఇటీవలే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ. 178 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది. కళ్యాణీ ఎం4 వాహనాల తయారీకి సంబంధించిన ఈ ఆర్డర్.. ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఏరోస్పేస్‌లో ఈ కంపెనీ 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రోకరేజ్ సంస్థ విశ్లేషించింది.
(2 / 10)
CPCL పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి పర్యావరణ క్లియరెన్స్ పొందింది. ఇప్పటికే ఉన్న రిఫైనరీ సైట్‌కు ఆనుకుని ఉన్న 606 ఎకరాల భూమిని సేకరించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
(3 / 10)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రానున్న రెండేళ్లలో వివిధ ప్రాజెక్టుల స్థాపనను పూర్తిచేయనుంది. ఇది వృద్ధికి దోహదపడుతుంది.(MINT_PRINT)
(4 / 10)
L&T రాబోయే 2-3 సంవత్సరాల్లో రుణాలను 5000 కోట్ల మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. H2FY23 నుండి బిడ్ టు అవార్డ్ రేషియో మరింత మెరుగుపడుతుందని కంపెనీ ఆశిస్తోంది, తద్వారా ఆర్డర్ ఇన్‌ఫ్లో పెరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.(Photo: Reuters)
(5 / 10)
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధిక డివిడెండ్ సుస్థిరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిస్క్ లేని ప్రభుత్వ రంగ సంస్థలకు రుణాలు ఇచ్చినందున మెరుగైన పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రయివేటు సెక్టార్‌కు ఇచ్చిన రుణాల పనితీరు బాగోలేకపోయినో డివిడెండ్ పంపిణీ చేసే సామర్థ్యం ఉంది.
(6 / 10)
గ్యాస్ టర్బైన్ ప్రాజెక్ట్, అమ్మోనియా ప్లాంట్ పునరుద్ధరణ వల్ల యూరియా తయారీలో ఇంధన వినియోగాన్ని తగ్గించడం వల్ల రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అధిక లాభాలను ఆర్జించగలదని భావిస్తున్నారు.
(7 / 10)
ఎస్‌బీఐ అనుబంధ సంస్థల పనితీరు అద్భుతంగా ఉండడంతో బ్యాంక్ వాల్యుయేషన్‌కు అదనపు విలువ సమకూరుతోంది.(MINT_PRINT)
(8 / 10)
2023 కోసం హెచ్‌డీఎఫ్‌సీ రెకెమెండ్ చేసిన స్టాక్ ఏసీసీ. అంబుజా, ఏసీసీ మధ్య సమన్వయం మెరుగ్గా ఉండి ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది.
(9 / 10)
కంపెనీ మార్జిన్లు బాగా తగ్గిపోయాయని జెన్సార్ ప్రస్తావించింది. విభిన్న సేవల కూర్పు, ఉద్యోగుల స్వరూపాన్ని ఆప్టిమైజ్ చేయడం, నియామక ఖర్చుల హేతుబద్ధీకరణ వంటి చర్యల ద్వారా మార్జిన్లు ఇకపై మెరుగుపడతాయని కంపెనీ విశ్వసిస్తోంది.
(10 / 10)
2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ క్యాపెక్స్ రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లు ఉంటుందని కంపెనీ అంచనా. కొత్త ఆర్డర్లు దక్కుతాయని కంపెనీ విశ్వసిస్తోంది.
ఇతర గ్యాలరీలు