Medicinal Flowers। పువ్వుల్లో దాగి ఉన్న ఈ ఔషధ గుణాలు తెలిస్తే.. అతిశయమే అనుకోరా!
- రంగురంగుల పుష్పాలు పరిసరాలకు ప్రత్యేక ఆకర్షణను కలిగిస్తాయి, సువాసనను వెదజల్లుతాయి, ఆడవారి జడకొప్పుకు అందన్నిస్తాయి, పూజకు ఉపయోగపడతాయి. అంతేనా? ఈ పువ్వుల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయని మీకు తెలుసా?
- రంగురంగుల పుష్పాలు పరిసరాలకు ప్రత్యేక ఆకర్షణను కలిగిస్తాయి, సువాసనను వెదజల్లుతాయి, ఆడవారి జడకొప్పుకు అందన్నిస్తాయి, పూజకు ఉపయోగపడతాయి. అంతేనా? ఈ పువ్వుల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయని మీకు తెలుసా?
(1 / 7)
పువ్వులు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు.. ఆహార పానీయాలు, హెయిర్ డైలు, ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు. పువ్వులతో ఏమేం తయారు చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.(Representative Image (Unsplash))
(2 / 7)
Tea: చాయ్ పత్తితోనే కాదు, పువ్వులతోనూ టీ చేసుకోవచ్చు. చామంతి, జాస్మిన్, బీ బామ్ పువ్వులులను టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి టీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.(Representative Image (Unsplash))
(3 / 7)
Medicine: కొన్ని రకాల పువ్వులను ఔషధాల తయారీలో చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. చామంతి జాతి పువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇవి బెణుకులు, గాయాలు నయం చేయటానికి అలాగే ముఖ్యమైన నూనెలు తయారీలలో ఉపయోగిస్తారు.(Representative Image (Unsplash))
(4 / 7)
Dyes: సన్‌ఫ్లవర్, వెల్డ్, కోరోప్సిస్, డహ్లియాస్, సల్ఫర్ కాస్మోస్, మ్యారిగోల్డ్, డైయర్స్ చమోమిలే వంటి పువ్వులు వర్ణాలను ఉత్పత్తి చేయగలవు. వీటిని తలకు రంగువేసుకోటానికి హెయిర్ డైల తయారీలో వినియోగిస్తారు.(Representative Image (Unsplash))
(5 / 7)
Beauty products: సబ్బులు, టోనర్లు, క్రీమ్‌లు వంటి అనేక సౌందర్య ఉత్పత్తులలో పూల సారం ఉంటుంది. మీ చర్మ సౌందర్యానికి మీరు నేరుగా కొన్ని పువ్వులను ఉపయోగించుకోవచ్చు. వీటితో రోజ్ వాటర్ టోనర్ , సబ్బుల వంటివి మీ స్వంతంగా తయారు చేసుకోవచ్చు.(Representative Image (Unsplash))
(6 / 7)
Air purifiers: కొన్ని ఇంట్లో పెరిగే మొక్కలు గాలిని శుద్ధి చేయగలవని అనేక అధ్యయనాలు సూచించాయి. బెంజీన్, ఫార్మాల్డిహైడ్, హెక్సేన్ సమ్మేళనాలు కలిగిన పువ్వులు వాయు కాలుష్యాన్ని తగ్గించగలవు.(Representative Image (Unsplash))
ఇతర గ్యాలరీలు