Provident Fund: హోలీకి ముందు EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్ ?-epfo to decide on interest rate for 2021 22 in march ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Epfo To Decide On Interest Rate For 2021-22 In March

Provident Fund: హోలీకి ముందు EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్ ?

Mar 12, 2022, 07:44 AM IST HT Telugu Desk
Mar 12, 2022, 07:44 AM , IST

EPFO ఖాతాదారులకు హోలీకి ముందు గుడ్‌న్యూస్ అందనుందా? ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల రెండు రోజుల సమావేశం గౌహతిలో ప్రారంభమైంది. ఇందులో, 2021-22కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఖరారు చేయబడుతుంది.

అయితే ఈ ఏడాదికి గాను వడ్డీ రేటు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

గౌహతిలో సమావేశంలో .. PF వడ్డీ రేట్లపై CBT కమిటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. వడ్డి రెట్లు స్థిరంగా ఉంచలా లేక పెంచలా అనే దానిపై సభ్బులు ఈ సమావేశంలో చర్చించనున్నారు.  తర్వాత, అది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపబడుతుంది. మార్చి, 2020లో, EPFO ​​PF డిపాజిట్లపై వడ్డీ రేటును 2019-20కి 8.5 శాతానికి తగ్గించింది, ఇది ఏడు సంవత్సరాల కనిష్ట స్థాయి. 2018-19లో, EPFOపై 8.65 శాతం వడ్డీ ఇవ్వబడింది.

(1 / 5)

గౌహతిలో సమావేశంలో .. PF వడ్డీ రేట్లపై CBT కమిటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. వడ్డి రెట్లు స్థిరంగా ఉంచలా లేక పెంచలా అనే దానిపై సభ్బులు ఈ సమావేశంలో చర్చించనున్నారు.  తర్వాత, అది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపబడుతుంది. మార్చి, 2020లో, EPFO ​​PF డిపాజిట్లపై వడ్డీ రేటును 2019-20కి 8.5 శాతానికి తగ్గించింది, ఇది ఏడు సంవత్సరాల కనిష్ట స్థాయి. 2018-19లో, EPFOపై 8.65 శాతం వడ్డీ ఇవ్వబడింది.(Mint)

EPFO 2016-17, 2017-18లో కూడా 8.65 శాతం వడ్డీని చెల్లించింది. అంతకు ముందు ఏడాదిలో అంటే 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా.. 2013-14, 2014-15లో కూడా 8.75 శాతం ఉంది.

(2 / 5)

EPFO 2016-17, 2017-18లో కూడా 8.65 శాతం వడ్డీని చెల్లించింది. అంతకు ముందు ఏడాదిలో అంటే 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా.. 2013-14, 2014-15లో కూడా 8.75 శాతం ఉంది.(MINT_PRINT)

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, CBT వడ్డీ రేట్లను తగ్గించాలని లేదా స్థిరంగా ఉంచాలని నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన కారణంగా ఇది సంస్థ ఆదాయాలపై ప్రభావం చూపవచ్చు. అటువంటి పరిస్థితిలో, 2021-22 ఆర్థిక సంవత్సరానికి PF వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచే అవకాశం ఉంది. మరోవైపు కోత పడే అవకాశం కూడా ఉంది.

(3 / 5)

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, CBT వడ్డీ రేట్లను తగ్గించాలని లేదా స్థిరంగా ఉంచాలని నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన కారణంగా ఇది సంస్థ ఆదాయాలపై ప్రభావం చూపవచ్చు. అటువంటి పరిస్థితిలో, 2021-22 ఆర్థిక సంవత్సరానికి PF వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచే అవకాశం ఉంది. మరోవైపు కోత పడే అవకాశం కూడా ఉంది.(Reuters)

దీనితో పాటు, EPFO ​వద్ద ఉన్న క్లెయిమ్ చేయని మొత్తం నుండి 100 కోట్ల రూపాయలను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ చేసే ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

(4 / 5)

దీనితో పాటు, EPFO ​వద్ద ఉన్న క్లెయిమ్ చేయని మొత్తం నుండి 100 కోట్ల రూపాయలను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ చేసే ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.(MINT_PRINT)

2015లో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈపీఎఫ్, పీపీఎఫ్ అలాగే ఇతర పొదుపు పథకాలలో ఉన్న అన్‌ క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఏడేళ్ల తర్వాత సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ చేయాలి. ఈపీఎఫ్‌వోకు వచ్చే ఆదాయంలో ఐదు శాతం వరకు ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్‌లు)లో పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

(5 / 5)

2015లో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈపీఎఫ్, పీపీఎఫ్ అలాగే ఇతర పొదుపు పథకాలలో ఉన్న అన్‌ క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఏడేళ్ల తర్వాత సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ చేయాలి. ఈపీఎఫ్‌వోకు వచ్చే ఆదాయంలో ఐదు శాతం వరకు ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్‌లు)లో పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.(Reuters)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు