Crazy Cricket Record: ఒక్క బంతికి 286 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రికార్డు..!-cricket news 286 runs were scored off in just 1 ball in australia this is crazy record in test cricket history ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Cricket News 286 Runs Were Scored Off In Just 1 Ball In Australia This Is Crazy Record In Test Cricket History

Crazy Cricket Record: ఒక్క బంతికి 286 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రికార్డు..!

May 11, 2023, 01:45 PM IST Maragani Govardhan
May 11, 2023, 01:45 PM , IST

  • Crazy Cricket Record: క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్ అని అంటారని సంగతి తెలిసిందే. ఇప్పుడు వినోదం పెరిగింది, అలాగే డబ్బు బాగా పెరిగింది. ఫలితంగా ఆటలో రికార్డులను సృష్టించడం, వాటిని తిరిగి బద్దలు కొట్టడం సహజమైపోయాయి. కానీ ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ బద్దలు కాలేదనే సంగతి మీకు తెలుసా?

ఒక ఓవర్లోని 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టే కాలమిది. ఓవర్లో 37 పరుగులు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అలాగే ఒక్క బంతికి 19 పరుగులు సమర్పించుకున్న సంగతి కూడా తెలిసిందే. కానీ ఒక్క బంతికి 286 పరుగులు చేయడం ఎప్పుడైనా చూశారా? ఇది అబద్దమనుకుంటే మీరు పొరబడినట్లే.. నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. 

(1 / 6)

1894 జనవరి 15న వెస్ట్రన్ ఆస్ట్రేలియా-విక్టోరియా జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఒక్క బంతికి 286 పరుగులు వచ్చాయి.

(2 / 6)

అదేంటి ఒక్క బంతికి 286 పరుగులు ఎలా సాధించారు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మహా అయితే సిక్సర్ వరకు రావచ్చు. నోబాల్ వేస్తే మరి కొన్ని అదనపు పరుగులు రావచ్చు.. అంతేకానీ 286 పరుగులు చేయడం సాధ్యమవుతుందా? అని మీరనుకోవచ్చు. 

(3 / 6)

విక్టోరియా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి బౌలర్ విసిరిన బంతిని బ్యాటర్ భారీ షాట్ కొట్టడంతో అది దగ్గరలో ఉన్న జరా చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయింది. ఇరుక్కున్న బంతిని తీయడానికి ఫీల్డర్లు చాలా ఇబ్బంది పడ్డారు. 

(4 / 6)

చెట్టు కొమ్మలో ఇరుక్కున్న బంతిని ఫీల్డర్లు తీసే లోపు బ్యాటర్లు ఇద్దరూ 286 పరుగులు చేశారు. అయితే ఈ అంపైర్లు గుర్తింపు ఇచ్చారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. కొన్ని నివేదికలు ఇచ్చారని చెబుతుంటే.. మరికొన్ని మాత్రం ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాయి. 

(5 / 6)

చెట్టు కొమ్మలో ఇరుక్కున్న బంతిని పట్టుకుంటే క్యాచ్ ఔటయ్యే వారు కదానే సందేహం మీకు రావచ్చు. అయితే బంతి చెట్టు నుంచి కిందపడిన సమయంలో దాన్ని ఎవ్వరూ పట్టుకోలేదని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో విక్టోరియా జట్టు విజయం సాధించింది. 1894 జనవరి 15న ఓ ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు