Ways To Say Thank You । ఎవరికైనా 'ధన్యవాదాలు' తెలియజేయడానికి వివిధ మార్గాలు!
Ways To Say Thank You: జీవితంలో ఎదుటి వ్యక్తులను గౌరవించడం, సందర్భానికి తగినట్లుగా అభినందించడం, వారి సహాయానికి ధన్యవాదాలు చెప్పడం ద్వారా మీరు సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా థాంక్స్ చెప్పాలనుకుంటే ఈ మార్గాలు చూడండి.
(1 / 8)
ఎదుటి వ్యక్తులను మెచ్చుకోవడం, వారి సహకారానికి కృతజ్ఞతలు చెప్పడం జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి గొప్పమార్గం. 'ధన్యవాదాలు' అని నోటితో మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న సంజ్ఞలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. 'ధన్యవాదాలు' చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఆలోచనలు చూడండి(Photo by wewe yang on Pexels)
(2 / 8)
మాటలతో కృతజ్ఞతను తెలియజేయండి: "ధన్యవాదాలు" చెప్పండి, మీరు వారిని ఎందుకు అభినందిస్తున్నారో వారికి చెప్పండి. (File Photo)
(3 / 8)
ధన్యవాదాలు తెలుపుతూ లెటర్ వ్రాయండి: మీ భావాలను వ్యక్తీకరిస్తూ లెటర్ రాయడం, కృతజ్ఞతను తెలియజేయడం ఒక అందమైన, ఆలోచనాత్మకమైన మార్గం.(Pixabay)
(4 / 8)
ఒక చిన్న బహుమతి ఇవ్వండి: ఇది చాలా విలువైనది కానవసరం లేదు; ఒక పువ్వు ఇవ్వడం, లేదా చాక్లెట్ ఇవ్వడం ద్వారా కూడా కృతజ్ఞత తెలపవచ్చు. (Photo by Towfiqu barbhuiya on Unsplash)
(5 / 8)
మీ సహాయాన్ని అందించండి: వారు కష్టకాలంలో ఉంటే, వారికి అవసరమైన ఏదైనా సహాయం అందించండి. ఇలాంటివి కూడా మీలోని కృతజ్ఞతాభావాన్ని చూపుతాయి. (Shutterstock)
(6 / 8)
వారి సహకారాన్ని పబ్లిక్‌గా గుర్తించండి: ఇతరుల ముందు వారిని ప్రశంసించండి, సోషల్ మీడియాలో వారి విజయాలను పంచుకోండి లేదా సమావేశంలో వారిని మెచ్చుకోండి. (Unsplash)
(7 / 8)
కలిసి నాణ్యమైన సమయాన్ని గడపండి: ఎవరితోనైనా నాణ్యమైన సమయాన్ని గడపడం, వారు ఆనందించే పని చేయడం ద్వారా మీరు వారికి విలువ ఇస్తున్నారని, వారిని అభినందిస్తున్నారని చూపిస్తుంది.(Pexels)
(8 / 8)
కౌగిలి ఇవ్వండి: వారు మీకు ఆత్మీయులైతే ఒక కౌగిలి ఇవ్వండి, వారికోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. (TikTok/@ambularnelson3)
ఇతర గ్యాలరీలు