WhatsApp new feature: సెండర్ చేతిలో ఆయుధం.. వాట్సాప్ కొత్త ‘కీప్ ఇన్ చాట్’ ఫీచర్-zuckerberg announces whatsapp s new keep in chat feature ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Feature: సెండర్ చేతిలో ఆయుధం.. వాట్సాప్ కొత్త ‘కీప్ ఇన్ చాట్’ ఫీచర్

WhatsApp new feature: సెండర్ చేతిలో ఆయుధం.. వాట్సాప్ కొత్త ‘కీప్ ఇన్ చాట్’ ఫీచర్

HT Telugu Desk HT Telugu
Apr 21, 2023 02:17 PM IST

WhatsApp new feature: వినియోగదారులను ఆకర్షించేలా, వారికి ఉపయోగపడే కొత్త కొత్త ఫీచర్ల ( new feature) ను క్రమం తప్పకుండా తీసుకువచ్చే వాట్సాప్ (WhatsApp) తాజాగా మరో అప్ డేట్ (update) ను ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

WhatsApp new feature: వాట్సాప్ (WhatsApp), ఫేస్ బుక్ (facebook) ల యాజమాన్య సంస్థ మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) వాట్సాప్ లో కొత్త ఫీచర్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫీచర్ ను ఆయన మెసేజ్ లను పంపించే సెండర్ (sender) చేతిలో ఆయుధమని అభివర్ణించారు.

WhatsApp new feature: కీప్ ఇన్ చాట్ ఫీచర్

కొత్తగా ‘కీప్ ఇన్ చాట్ (Keep In Chat)’ ఫీచర్ ను వాట్సాప్ తమ యూజర్ల కోసం ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఫీచర్ వాట్సాప్ సెక్యూరిటీ ఫీచర్లలో అదనపు లేయర్ అని పేర్కొంది. వాట్సాప్ సందేశాలు అనవసరంగా ఇతరులకు చేరకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) వివరించారు. ప్రస్తుతం వాట్సాప్ లో ‘డిసప్పీయరింగ్ మెసేజెస్ (disappearing messages)’ ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆప్షన్ ను ఆన్ లో పెట్టుకున్న యూజర్లు.. తాము కోరుకుంటే, అవసరమనుకున్న కొన్ని చాట్స్ ను సేవ్ చేసుకునే అవకాశం ఈ Keep In Chat ఫీచర్ కల్పిస్తుంది.

WhatsApp new feature: సెండర్ దే ఫైనల్ డెసిషన్

అయితే, ఆ మెసేజ్ సేవ్ చేసుకునే విషయంలో తుది నిర్ణయం సెండర్ (sender) దే అవుతుంది. రిసీవర్ కు ఆ అవకాశం లేదు. తద్వారా తాను పంపించే మెసేజ్ (messages) తనకు ఇష్టం లేకుండా ఇతరులకు చేరకుండా సెండర్ జాగ్రత్త పడవచ్చు. సెండర్ (sender) మెసేజ్ పంపిన తరువాత ఒకవేళ రిసీవర్ కీప్ ఇన్ చాట్ (Keep In Chat) ఆప్షన్ ద్వారా ఆ మెసేజ్ ను సేవ్ చేసుకోవాలనుకుంటే.. ఆ విషయం సెండర్ (sender) కు వాట్సాప్ తెలియజేస్తుంది. దాంతో, రిసీవర్ (receiver) ఆ మెసేజ్ ను సేవ్ చేసుకోవడానికి అనుమతించాలా? వద్దా? అనేది సెండర్ (sender) మాత్రమే నిర్ణయిస్తారు. సెండర్ కు ఇష్టం లేకపోతే, రిసీవర్ (receiver) ఆ మెసేజ్ ను సేవ్ చేసుకోలేరు. అందుకే ఈ ఆప్షన్ ను ‘సెండర్ సూపర్ పవర్ (Sender superpower)’ గా జుకర్ బర్గ్ అభివర్ణించారు. అలాగే, వాట్సాప్ లో సేవ్ చేసుకున్న మెసేజెస్ ‘కెప్ట్ మెసేజెస్ (Kept Messages)’ ఫోల్డర్ లో ఒక బుక్ మార్క్ ఐకన్ (bookmark icon) తో కనిపిస్తాయి. ఈ ఫీచర్ ను ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని వారాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

WhatsApp announced new 'Keep In Chat' feature
WhatsApp announced new 'Keep In Chat' feature
WhatsApp channel

టాపిక్