WhatsApp Tips: వాట్సాప్ స్టేటస్‍ను ఫేస్‍బుక్‍లో ఎలా షేర్ చేయవచ్చు?-you can share your whatsapp status on facebook follow these steps ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  You Can Share Your Whatsapp Status On Facebook Follow These Steps

WhatsApp Tips: వాట్సాప్ స్టేటస్‍ను ఫేస్‍బుక్‍లో ఎలా షేర్ చేయవచ్చు?

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 25, 2023 09:56 AM IST

WhatsApp Tips: వాట్సాప్ స్టేటస్‍ను ఫేస్‍బుక్‍లో షేర్ చేసే ఫీచర్ ప్రస్తుతం యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇది ఎలా వాడాలంటే..

WhatsApp Tips: వాట్సాప్ స్టేటస్‍ను ఫేస్‍బుక్‍లో ఎలా షేర్ చేయవచ్చు?
WhatsApp Tips: వాట్సాప్ స్టేటస్‍ను ఫేస్‍బుక్‍లో ఎలా షేర్ చేయవచ్చు? (HT_PRINT)

WhatsApp Tips: వాట్సాప్ స్టేటస్ చాలా ఫేమస్. యూజర్లు.. వాట్సాప్‍లో ఫొటోలు, వీడియో, టెక్ట్స్ ఇలా ఏదైనా స్టేటస్‍గా సెట్ చేసుకోవచ్చు. వారి కాంటాక్ట్స్ చూసేలా స్టేటస్ ఏర్పాటు చేసుకోవచ్చు. 24 గంటల తర్వాత ఆటోమేటిక్‍గా ఈ స్టేటస్ మాయమవుతుంది. ఇన్‍స్టాగ్రామ్, స్నాప్‍చాట్ సహా చాలా సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ల్లో ఇలాంటి సదుపాయం ఉంది. కాగా, స్టేటస్‍కు వాట్సాప్ వరుసగా ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే కొన్ని సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

WhatsApp Status to Facebook: వాట్సాప్ స్టేటస్‍ను ఫేస్‍బుక్‍పై షేర్ చేసేలా ఓ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అలాగే మీ కాంటాక్టుల్లో ఎవరైనా కొత్తగా స్టేటస్ అప్‍డేట్ చేస్తే చాట్ లిస్టులోనే వారి ప్రొఫైల్ పిక్చర్ చుట్టూ గ్రీన్ రింగ్ కనిపిస్తోంది. ఈ రింగ్‍పై క్లిక్ చేస్తే అక్కడే మీరు వారి స్టేటస్ చూడవచ్చు. దీన్ని స్టేటస్ రింగ్ పేరుతో వాట్సాప్ తీసుకొచ్చింది. అలాగే, వాట్సాప్ స్టేటస్‍ను నేరుగా ఫేస్‍బుక్‍పై కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఎలా షేర్ చేయవచ్చో ఇక్కడ చూడండి.

వాట్సాప్ స్టేటస్‍ను ఫేస్‍బుక్‍లో ఎలా షేర్ చేయాలంటే..

  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‍లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత లెఫ్ట్ కు స్వైప్ చేయడమో.. లేదా స్టేటస్ ట్యాబ్ మీద ట్యాప్ చేయడమో చేసి స్టేటస్ ఆప్షన్‍లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత కెమెరా ఐకాన్‍పై క్లిక్ చేసి.. మీరు ఏం స్టేటస్‍గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి.
  • వాట్సాప్‍లో స్టేటస్ సెట్ చేసిన తర్వాత.. మై స్టేటస్ పక్కనే ఉండే.. త్రీ డాటెడ్ (...) మెనూపై ట్యాప్ చేయండి. (కొన్ని మొబైళ్లలో మై స్టేటస్ కిందే షేర్ టు ఫేస్‍బుక్ ఆప్షన్ కనిపిస్తుంది.)
  • ఆ తర్వాత వ్యూస్ పక్కనే ఉండే మరో డాటెడ్ మెనూపై క్లిక్ చేసి “షేర్ టు ఫేస్‍బుక్” (Share to Facebook) ఆప్షన్‍పై ట్యాప్ చేయండి.
  • ఒకవేళ మీ ఫేస్‍బుక్ అకౌంట్ వాట్సాప్‍తో ఇంకా కనెక్ట్ కాకపోయి ఉంటే.. లాగిన్ అవ్వాలని అడుగుతుంది.
  • ఆ తర్వాత ఫేస్‍బుక్‍లో షేర్ చేసే ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఆ స్టేటస్‍కు క్యాప్షన్ కూడా పెట్టుకోవచ్చు.
  • చివరగా పోస్ట్/షేర్ బటన్‍పై ట్యాప్ చేస్తే మీ వాట్సాప్ స్టేటస్ ఫేస్‍బుక్‍లో పోస్ట్ అవుతుంది.

వాట్సాప్ స్టేటస్‍ను ఫేస్‍బుక్‍లో షేర్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం వాట్సాప్ మొబైల్ యాప్‍కు అందుబాటులో ఉంది. వాట్సాప్ వెబ్ వెర్షన్‍కు లేదు.

WhatsApp channel