Flipkart Mobile Bonanza: ఈ వివో బడ్జెట్ మొబైల్‍పై బంపర్ ఆఫర్.. కొనొచ్చా?-vivo t1x gets huge discount on flipkart mobiles bonanza sale should you buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Vivo T1x Gets Huge Discount On Flipkart Mobiles Bonanza Sale Should You Buy

Flipkart Mobile Bonanza: ఈ వివో బడ్జెట్ మొబైల్‍పై బంపర్ ఆఫర్.. కొనొచ్చా?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 13, 2022 08:20 PM IST

Vivo T1X Discount on Flipkart: మొబైల్ బొనాంజా సేల్ సందర్భంగా ఫ్లిప్‍కార్ట్ లో వివో టీ1ఎక్స్ మొబైల్ ఆకర్షణీయమైన ఆఫర్ తో లభిస్తోంది.

Flipkart Mobile Bonanza: ఈ వివో బడ్జెట్ మొబైల్‍పై బంపర్ ఆఫర్.. కొనొచ్చా?
Flipkart Mobile Bonanza: ఈ వివో బడ్జెట్ మొబైల్‍పై బంపర్ ఆఫర్.. కొనొచ్చా? (Vivo)

Flipkart Mobile Bonanza: పాపులర్ ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్ లో మొబైల్ బొనాంజా సేల్ నడుస్తోంది. దీంట్లో భాగంగా చాలా ఫోన్లు డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. బ్యాంక్ కార్డ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈనెల 14వ తేదీ వరకు ఈ బొనాంజా ఆఫర్లు ఉండనున్నాయి. ఈ తరుణంలో ఓ వివో బడ్జెట్ ఫోన్‍పై ఆకర్షణీయమైన డీల్ లభిస్తోంది. వివో టీ1ఎక్స్ (Vivo T1X) స్మార్ట్ ఫోన్‍పై ఈ ఆఫర్ ప్రస్తుతం ఉంది. 29శాతం డిస్కౌంట్‍తో పాటు కార్డ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇవే.

Flipkart Mobile Bonanza: వివో టీ1ఎక్స్ ఫోన్‍పై డీల్

వివో టీ1ఎక్స్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం లిస్టింగ్ ధరపై 29 శాతం డిస్కౌంట్‍తో రూ.11,999కే ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో ఉంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‍ను ఈ మోడల్ కలిగి ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే మరో రూ.1,000 అదనపు డిస్కౌంట్‍ను పొందొచ్చు. అంటే రూ.10,999కే ఈ ఫోన్‍ను సొంతం చేసుకోవచ్చు. వివో టీ1ఎక్స్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.12,999 ధరకు లభిస్తుండగా.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా వినియోగించుకోవవచ్చు.

Vivo T1X Specifications: వివో టీ1ఎక్స్ స్పెసిఫికేషన్లు

6.58 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ రెజల్యూషన్ LCD డిస్‍ప్లేను వివో టీ1ఎక్స్ కలిగి ఉంది. క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 680 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. అయితే ఫోన్ హీట్‍ను కంట్రోల్ చేసేందుకు నాలుగు లేయర్ల కూలింగ్ సిస్టమ్‍ను ఈ మొబైల్‍లో పొందుపరిచినట్టు వివో పేర్కొంది.

వివో టీ1ఎక్స్ ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఉండగా.. మరో 2 మెగాపిక్సెల్ లెన్స్ కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ 4జీ ఫోన్‍కు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను వివో ఇచ్చింది.

Vivo T1X స్మార్ట్ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉండగా.. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‍కే ఉంటుంది.

Vivo T1Xను కొనుగోలు చేయవచ్చా..!

ప్రస్తుత డిస్కౌంట్ ధరతో వివో టీ1ఎక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా వినియోగించుకుంటే ఈ డీల్ పైసా వసూల్‍గా ఉంటుంది. 5జీ కనెక్టివిటీ లేకపోయినా సరే.. బడ్జెట్ రేంజ్‍లో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది సూటవుతుంది. అయితే ఈ రేంజ్‍లో రియల్‍మీ, పోకో నుంచి కాస్త మెరుగైన స్పెసిఫికేషన్లతో కొన్ని ఆప్షన్లు లభిస్తున్నాయి. అయితే బడ్జెట్ ధరలో వివో ఫోన్ కావాలనుకునే వారికి ప్రస్తుతం Vivo T1Xపై ఉన్న ఆఫర్ సూటవుతుందని చెప్పవచ్చు.

WhatsApp channel

టాపిక్