Unacademy lay off: 12% ఉద్యోగులను తొలగించనున్న ‘అన్ ఎకాడమీ’-unacademy to lay off 12 pc employees as it aims to turn core biz profitable ceo ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Unacademy To Lay Off 12 Pc Employees As It Aims To Turn Core Biz Profitable: Ceo

Unacademy lay off: 12% ఉద్యోగులను తొలగించనున్న ‘అన్ ఎకాడమీ’

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 09:27 PM IST

Unacademy lay off: ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్ట్ అప్ అన్ ఎకాడమీ (Unacademy) తమ ఉద్యోగులకు మరోసారి లే ఆఫ్ (lay off) ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 12% మందికి ఉద్వాసన పలకనున్నట్లు వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Unacademy lay off: ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ (Edtech firm) అన్ అకాడమీ (Uncademy) తమ ఉద్యోగుల్లో 12 % మందికి లే ఆఫ్ (lay off) ప్రకటించనున్నట్లు తెలిపింది. తమ కోర్ బిజినెస్ ను లాభదాయకం చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీఈఓ గౌరవ్ ముంజల్ (Gaurav Munjal) వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Unacademy lay off: 12% ఉద్యోగులకు ఉద్వాసన

ఇప్పుడున్న ఉద్యోగుల్లో 12% మందిని తొలగించనున్నట్లు (lay off) అన్ అకాడమీ (Uncademy) తెలిపింది. అంటే, సుమారు 350 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా నెలకొంటున్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అన్ అకాడమీ (Uncademy) ఫౌండర్, సీఈఓ గౌరవ్ ముంజల్ (Gaurav Munjal) వెల్లడించారు. సంస్థ ను లాభాల దిశగా నడిపించడానికి మరికొన్ని కఠిన చర్యలు తీసుకోకతప్పడం లేదని ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెయిల్ లో ఆయన వివరించారు. తప్పని సరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు (lay off) తీసుకోవాల్సి వస్తోందని, అందుకు ఉద్యోగులు తనను క్షమించాలని ఆయన వేడుకున్నారు.

Unacademy lay off: సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులు..

అన్ అకాడమీ (Uncademy) ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించాయి. అన్ అకాడమీ (Uncademy) లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో జనరల్ అట్లాంటిక్ (General Atlantic), టైగర్ గ్లోబల్ (Tiger Global), సాఫ్ట్ బ్యాంక్ (Softbank) మొదలైనవి ఉన్నాయి. అన్ అకాడమీ (Uncademy) లో తొలి లే ఆఫ్ (lay off) గత సంవత్సరం ఏప్రిల్ లో జరిగింది. అప్పుడు 600 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించారు. ఆ తరువాత గత నవంబర్ లో మరో 350 మంది ఉద్యోగులను (lay off) తొలగించారు. తాజాగా, మరో 350 మందిని తొలగించాలని నిర్ణయించారు.

WhatsApp channel