4 upcoming cars from Kia: కియా నుంచి వస్తున్న 4 న్యూ మోడల్ కార్స్-top 4 upcoming cars from kia ready to roar in 20232024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Top 4 Upcoming Cars From Kia Ready To Roar In 2023-2024

4 upcoming cars from Kia: కియా నుంచి వస్తున్న 4 న్యూ మోడల్ కార్స్

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 07:05 PM IST

4 upcoming cars from Kia: రానున్న కొద్ది సంవత్సరాలలో కియా (Kia) భారత్ మార్కెట్లో కొన్ని కొత్త మోడల్ కార్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అలాగే, 2025 నాటికి కియా నుంచి ఒక ఎలక్ట్రిక్ ఎస్ యూ (electric SUV) వీ కూడా రానుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Kia)

4 upcoming cars from Kia: భారత్ లో తన మార్కెట్ ను మరింత విస్తరించడానికి కియా (Kia) కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరో రెండేళ్లలో భారత్ లో కియా విడుదల చేయనున్న నాలుగు కొత్త మోడల్ కార్ల వివరాలివి..

ట్రెండింగ్ వార్తలు

Kia Sonet CNG: కియా సొనెట్ సీఎన్జీ

కియా సొనెట్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. ఈ మోడల్ నుంచి సీఎన్జీ వర్షన్ (Kia Sonet CNG) ను త్వరలో మార్కెట్లోకి తీసుకురావాలని కియా (Kia) యోచిస్తోంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అమర్చనున్నారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Brezza CNG, Nexon CNG లతో పోటీ పడనుంది. కియా సొనెట్ సీఎన్జీ ధర పెట్రోల్ వర్షన్ కన్నా రూ. 1 లక్ష వరకు ఎక్కువగా ఉండే అవకాశముంది.

Kia Carens five-seater: కియా కేరన్స్ ఫైవ్ సీటర్

కియా (Kia) నుంచి వస్తున్న మరో కొత్త మోడల్ కియా కేరెన్స్ (Kia Carens). కేరెన్స్ ఎంపీవీ కి ఇది 5 సీటర్ లో ఎంట్రీ లెవెల్ వేరియంట్. ఇందులో నేచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అమర్చారు. కేరెన్స్ ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ బేసిక్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ వేరియంట్లలో లెదర్ సీట్లు కానీ, సెకండ్ రో ఫోల్డింగ్ ఆర్మ్ రెస్ట్స్ కానీ ఉండవు.

New Kia Seltos: న్యూ కియా సెల్టోస్

ఇప్పటికే మార్కెట్లో ఉన్న కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇది ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికాల మార్కెట్లలో ప్రవేశపెట్టారు. 2023 చివరినాటికి భారత్ లో కూడా ఇది లభిస్తుంది. ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్ లో డిజైన్ లో, కేబిన్ లో స్వల్ప మార్పులు చేశారు. అలాగే, రాడార్ బేస్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను అమర్చారు. ఇదులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఫార్వార్డ్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ తదితర సదుపాయాలున్నాయి. కొత్త పెట్రోలు టర్బో ఇంజిన్ ను అమర్చారు.

New-gen Carnival: న్యూ జెన్ కార్నివాల్

ఈ కార్నివాల్ (new Kia Carnival) ను 2023 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. ఇది 3 వరుసల సీట్లు ఉండే ఎంపీవీ. ఈ సంవత్సరం చివరలో కానీ, 2024 ప్రారంభంలో కానీ ఇది ఇండియన్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్నివాల్ మోడల్ కన్నా ఇది 40ఎంఎం ఎక్కువ పొడవు, 10ఎంఎం ఎక్కువ వెడల్పు ఉంటుంది. వీల్ బేస్ కూడా 30 ఎంఎం ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా రాడార్ బేస్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను అమర్చారు. ఇదులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఫార్వార్డ్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ తదితర సదుపాయాలున్నాయి.

WhatsApp channel

టాపిక్