Stock market news: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 330 అప్-stock market news today 27th october 2022 in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market News: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 330 అప్

Stock market news: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 330 అప్

Stock market news today: స్టాక్ మార్కెట్లు గురువారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

మంగళవారం నాటి మార్కెట్ సూచీలు (PTI)

Stock market news today: స్టాక్ మార్కెట్లు గురువారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 334 పాయింట్లు పెరిగి 59,878 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 98.95 పాయింట్లు పెరిగి 17,755 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే

టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా, టైటన్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే తదితర స్టాక్స్ ఉన్నాయి.

Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే

టాప్ లూజర్స్ జాబితాలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, ఐటీసీ తదితర స్టాక్స్ ఉన్నాయి.

Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 248.36 పాయింట్లు బలపడి 59,792.32 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 115.05 పాయింట్లు బలపడి17,771 పాయింట్ల వద్ద స్థిరపడింది.

స్టాక్ మార్కెట్లకు నిన్న దీపావళి బలిప్రతిపాద సందర్భంగా సెలవు కావడంతో తెరుచుకోలేదు. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 287.70 పాయింట్లు క్షీణించి 59,543.96 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 17,656 వద్ద ముగిశాయి. వరుసగా ఏడు రోజులు లాభపడిన స్టాక్ మార్కెట్ల సూచీలు మంగళవారం పడిపోయాయి.

ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించవచ్చన్న ఊహాగానాలతో అమెరికా కరెన్సీ పతనమైన తర్వాత, గురువారం డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలపడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మంగళవారం ముగింపు 82.7250తో పోలిస్తే, ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌కు రూపాయి 82.10-82.20 వద్ద కదలొచ్చు. సెలవు దినం కావడంతో బుధవారం ఫారెక్స్ మార్కెట్లు తెరుచుకోలేదు. ఇక డాలర్ ఇండెక్స్ సుమారు 109.75 వద్ద ఉంది. నెలరోజుల కనిష్ట స్థాయికి సమీపంలో ఉంది.

కాగా చమురు ధర వరుసగా మూడో రోజూ స్వల్పంగా పెరిగింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో గత రెండు సెషన్‌లలో దాదాపు 4% లాభపడిన తర్వాత బ్యారెల్‌కు 88 డాలర్లకు చేరింది.