Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ప్రీ-ఆర్డర్స్ మొదలు.. రూ.1,999తో రిజర్వ్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్-samsung galaxy s23 series pre bookings starts in india know pre reserves benefits galaxy unpacked event date timings ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Samsung Galaxy S23 Series Pre Bookings Starts In India Know Pre Reserves Benefits Galaxy Unpacked Event Date Timings

Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ప్రీ-ఆర్డర్స్ మొదలు.. రూ.1,999తో రిజర్వ్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 12, 2023 05:06 PM IST

Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ప్రీ-బుకింగ్‍ మొదలైంది. సామ్‍సంగ్ వెబ్‍సైట్ ద్వారా ప్రీ-రిజర్వ్ (Samsung Galaxy S23 Series Pre-Booking) చేసుకోవచ్చు. దీని ద్వారా కొన్ని బెనిఫిట్స్ లభిస్తాయి. ఇక సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ లాంచ్ డేట్, టైమ్ వివరాలపై కూడా ఓ లుక్కేయండి.

Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ప్రీ-ఆర్డర్స్ మొదలు (Photo: Samsung)
Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ప్రీ-ఆర్డర్స్ మొదలు (Photo: Samsung)

Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ ఫ్లాగ్‍షిప్ సిరీస్ గెలాక్సీ ఎస్23 వచ్చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన సామ్‍సంగ్ ఎస్23 సిరీస్ లాంచ్ కానుంది. గెలాక్సీ అన్‍ప్యాక్డ్ (Galaxy Unpacked) ఈవెంట్ ద్వారా ఈ సిరీస్ ప్రీమియమ్ ఫోన్‍లను సామ్‍సంగ్ విడుదల చేయనుంది. అయితే ఈలోగానే ప్రీ-బుకింగ్‍ (Samsung Galaxy S23 Series Pre-Reserves)ను సామ్‍సంగ్ ప్రారంభించింది. ఈ సిరీస్ ఫోన్‍లు కొనాలనుకునే వారు ఇప్పుడే రూ.1,999 రిజర్వ్ చేసుకోవచ్చు. దీనిద్వారా కొన్ని బెనిఫిట్స్ లభిస్తాయి. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 లాంచ్ వివరాలు, ప్రీ-బుకింగ్ బెనిఫిట్‍లతో పాటు మిగిలిన డిటైల్స్ ఇవే.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 లాంచ్ ఈవెంట్

Samsung Galaxy S23 Series launch Event: ఫిబ్రవరి 1వ తేదీన అమెరికాలో శాన్‍ఫ్రాన్సిస్కోలో గెలాక్సీ అన్‍ప్యాక్డ్ ఈవెంట్ (Galaxy Unpacked) జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఈ ఈవెంట్ మొదలవుతుంది. ఈ ఈవెంట్‍లోనే సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు విడుదలవుతాయి. లాంచ్ ఈవెంట్‍లోనే ఈ మొబైళ్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లను సామ్‍సంగ్ వెల్లడించనుంది. ప్రీమియమ్ రేంజ్లో ఈ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‍లో మూడు మొబైళ్లు ఉండనున్నాయి. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23), సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ (Samsung Galaxy S23+), సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) రానున్నాయి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ప్రీ-బుకింగ్ బెనిఫిట్స్

Samsung Galaxy S23 Series Pre-booking Benefits: సామ్‍సంగ్ అధికారిక వెబ్‍సైట్ ద్వారా రూ.1,999 చెల్లించి ప్రస్తుతం సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ కోసం ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రీ-బుక్ చేసుకుంటే రూ.5,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రీ-రిజర్వ్ చేసుకున్న యూజర్లకు ఎస్23 సిరీస్‍లోని ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఎర్లీ డెలివరిని కూడా పొందవచ్చు. ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి రూ.2,000 విలువైన వెల్‍కమ్ వౌచర్ లభిస్తుంది. దీన్ని ఎస్23 సిరీస్ మోడల్ కొనుగోలు చేసే సమయంలో రిడీమ్ చేసుకోవచ్చు. సామ్‍సంగ్ షాప్ యాప్‍లో 2శాతం లాయల్టీ పాయింట్లు లభిస్తాయి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ స్పెసిఫికేషన్లు

Samsung Galaxy S23 Series Specifications: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‍లోని మూడు మొబైళ్లు ఫ్లాగ్‍షిప్ రేంజ్‍లో ఉంటాయి. దీంట్లో గెలాక్సీ ఎస్23 అల్ట్రా మరింత ప్రీమియమ్‍గా ఉంటుంది. ఎస్23 అల్ట్రా మోడల్ వెనుక 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. గెలాక్సీ ఎస్23, ఎస్23+ ఫోన్‍ల వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. మొత్తంగా ఈ మూడు మొబైళ్లు ఫ్లాగ్‍షిప్ సెన్సార్లతో కూడిన కెమెరాలతో వస్తాయి. క్వాల్‍కామ్ లేటెస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఈ ఫోన్‍లలో ఉంటాయి. మొత్తంగా అన్ని విభాగాల్లో ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను Samsung Galaxy S23 Series స్మార్ట్ ఫోన్లు కలిగి ఉంటాయి.

ఫిబ్రవరి 1న లాంచ్ ఈవెంట్‍లో గెలాక్సీ ఎస్23 సిరీస్ గురించి అన్ని వివరాలను సామ్‍సంగ్ వెల్లడిస్తుంది. లాంచ్ డేట్ దగ్గరపడే కొద్ది కొన్ని స్పెసిఫికేషన్లు క్రమంగా టీజ్ చేసే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం