Multibagger: జస్ట్ ఏడాదిలో రూ. 2. 50 నుంచి రూ. 86 కి చేరిన మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్-rs 2 5 to rs 86 penny stocks turns multibagger rises 3300 percent in two years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger: జస్ట్ ఏడాదిలో రూ. 2. 50 నుంచి రూ. 86 కి చేరిన మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్

Multibagger: జస్ట్ ఏడాదిలో రూ. 2. 50 నుంచి రూ. 86 కి చేరిన మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్

HT Telugu Desk HT Telugu
Aug 12, 2023 02:27 PM IST

Multibagger: కేవలం రెండే సంవత్సరాల వ్యవధిలో 3300% వృద్ధి సాధించిన పెన్నీ స్టాక్ గురించి తెలుసా? ఏడాది క్రితం రూ. 2.50 గా ఉన్న ఈ స్టాక్ షేర్ విలువ ఇప్పుడు రూ. 86 కి చేరింది. ఈ స్టాక్ లో 2023 ప్రారంభంలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు అది రూ. 5.3 లక్షలు అయ్యేది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (iStock)

Multibagger: కేవలం రెండే సంవత్సరాల వ్యవధిలో 3300% వృద్ధి సాధించిన పెన్నీ స్టాక్ గురించి తెలుసా? ఏడాది క్రితం రూ. 2.50 గా ఉన్న ఈ స్టాక్ షేర్ విలువ ఇప్పుడు రూ. 86 కి చేరింది. ఈ స్టాక్ లో 2023 ప్రారంభంలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు అది రూ. 5.3 లక్షలు అయ్యేది. అంతేకాదు, రెండేళ్ల క్రితం ఈ కంపెనీలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు అది రూ. 34 లక్షలుగా పెరిగేది.

మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్

2023 సంవత్సరంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీల్లో సర్వొటెక్ పవర్ సిస్టమ్స్ (Servotech Power Systems) కంపెనీ ఒకటి. ఇది మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ గా ఇన్వెస్లర్లకు కాసులు కురిపించింది. ఈ కంపెనీ గత సంవత్సర కాలంలో అత్యధిక వృద్ధి సాధించిన రూ. 100 లోపు పెన్నీ స్టాక్ గా ఈ సర్వొటెక్ పవర్ సిస్టమ్స్ కంపెనీ స్టాక్ నిలిచింది. సరిగ్గా సంవత్సర కాలంలో సర్వోటెక్ పవర్ కంపెనీ షేర్ విలువ రూ. 2. 5 నుంచి రూ. 86 కి పెరిగింది.

యూపీతో ఎంఓయూ

ఈ నెలలోనే ఈ సర్వొటెక్ పవర్ సిస్టమ్స్ కంపెనీ స్టాక్ విలువ రూ. 83 నుంచి రూ. 86 కి చేరింది. గత ఆరు నెలల్లో ఈ సంస్థ షేర్ విలువ 20.65 రూపాయల నుంచి 86 రూపాయలకు చేరింది అంటే దాదాపు 300 శాతం రిటర్న్ అందించింది. ఈ విధంగా ఇన్వెస్టర్లకు క్రమం తప్పకుండా లాభాలను అందిస్తున్న మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ గా సర్వొటెక్ పవర్ కంపెనీ నిలిచింది. తాజాగా, ఈ కంపెనీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఈ కంపెనీ యూపీలో రూ. 300 కోట్ల పెట్టుబడితో ఈవీ చార్జర్స్ తయారీ యూనిట్ ను ప్రారంభించనుంది.