Reliance Jio new plans: జియో నుంచి అన్ లిమిటెడ్ కాలింగ్, డేటాతో కొత్త ప్లాన్స్
Reliance Jio new plans: ప్రముఖ టెలీకాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) ఎప్పటికప్పుడు, యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రి పెయిడ్ ప్లాన్స్ తో ముందుకు వస్తోంది. అందులో భాగంగానే, తాజాగా, రెండు ప్లాన్స్ ను ఆవిష్కరించింది.
Reliance Jio new plans: రిలయన్స్ జియో (Reliance Jio) రెండు కొత్త ప్రి పెయిడ్ ప్లాన్స్ ను తెరపైకి తెచ్చింది. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2.5 జీబీ డేటాను ఈ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ Happy New Year 2023 ప్లాన్స్ ను జియో వెబ్ సైట్, మై జియో యాప్ పై పొందవచ్చు. అలాగే, అన్నిమొబైల్ రీచార్జ్ ప్లాట్ ఫామ్స్ నుంచి కూడా పొందవచ్చు.
Reliance Jio new plans: రూ. 349 ప్లాన్
జియో (Reliance Jio) లేటెస్ట్ గా తీసుకువచ్చిన ఈ రూ. 349 ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీతో డైలీ 2.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే, అన్ లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ లభిస్తుంది. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ తదితర సేవలు కూడా లభిస్తాయి. ఇవన్నీ కాకుండా, వెల్ కం ఆఫర్ లో భాగంగా 5జీ డేటాను కూడా అందిస్తోంది.
Reliance Jio new plans: రూ. 899 ప్లాన్
జియో (Reliance Jio) లేటెస్ట్ గా తీసుకువచ్చిన ఈ రూ. 899 ప్లాన్ తో 90 రోజుల వ్యాలిడిటీతో డైలీ 2.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే, 90 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ లభిస్తుంది. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ తదితర సేవలు కూడా లభిస్తాయి. ఇవన్నీ కాకుండా, వెల్ కం ఆఫర్ లో భాగంగా Reliance Jio 5జీ డేటాను కూడా అందిస్తోంది. ఇవి కాకుండా, రూ. 2023 ప్లాన్ తో 252 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలు లభిస్తున్నాయి. అలాగే, 2,999 ప్లాన్ తో 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలు లభిస్తున్నాయి.
టాపిక్