Realme 10 Pro+ 5G: కర్వ్‌డ్ డిస్‍ప్లే, 108MP కెమెరాతో రియల్‍మీ 10 ప్రో+ లాంచ్ వచ్చేసింది-realme 10 pro plus realme 10 pro launched in china may come to india very soon ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Realme 10 Pro Plus Realme 10 Pro Launched In China May Come To India Very Soon

Realme 10 Pro+ 5G: కర్వ్‌డ్ డిస్‍ప్లే, 108MP కెమెరాతో రియల్‍మీ 10 ప్రో+ లాంచ్ వచ్చేసింది

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 17, 2022 04:11 PM IST

Realme 10 Pro Series: రియల్‍మీ 10 ప్రో 5జీ, రియల్‍మీ 10 ప్రో+ 5జీ స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. అతి త్వరలో ఇండియాకు కూడా రానున్నాయి. రియల్‍మీ 10 ప్రో+ చాలా ఆకట్టుకునే విధంగా ఉంది.

రియల్‍మీ 10 సిరీస్ లాంచ్ (Photo: Realme China)
రియల్‍మీ 10 సిరీస్ లాంచ్ (Photo: Realme China)

Realme 10 Pro Series: రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ లాంచ్ అయింది. కొంతకాలం నుంచి ఈ సిరీస్‍ను టీజ్ చేస్తూ వచ్చిన రియల్‍మీ.. చైనా మార్కెట్‍లో గురువారం విడుదల చేసింది. ఈ సిరీస్‍లో రియల్‍మీ 10 ప్రో, రియల్‍మీ 10 ప్రో+ మొబైళ్లు వచ్చాయి. ప్రస్తుతం చైనా మార్కెట్‍లో లాంచ్ అయిన ఈ 5జీ సిరీస్.. త్వరలోనే ఇండియాకు కూడా రానుంది. రెండింట్లో.. రియల్‍మీ 10 ప్రో+ 5జీ ఆకర్షణీయంగా ఉంది. ఎడ్జ్ లు కర్వ్ అయి ఉన్న సూపర్ అమోలెడ్ డిస్‍ప్లే ఈ ఫోన్‍కు ప్రత్యేకంగా కనిపిస్తోంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ తో ఈ రియల్‍మీ 10 ప్రో+ స్మార్ట్ ఫోన్ వస్తోంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Realme 10 Pro+ Specifications: రియల్‍మీ 10 ప్రో+ స్పెసిఫికేషన్లు

6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ సూపర్ అమోలెడ్ కర్వ్‌డ్ ఎడ్జెస్ డిస్‍ప్లేతో రియల్‍మీ 10 ప్రో+ వస్తోంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. మైక్రో ఎస్‍డీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‍మీ యూఐ 4.0తో ఈ రియల్‍మీ నయా ఫోన్ లాంచ్ అయింది.

రియల్‍మీ 10 ప్రో+ 5జీ ఫోన్‍లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.

రియల్‍మీ 10 ప్రో+ ఫోన్ వెనుక మూడు కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ మొబైల్‍కు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రియల్‍మీ పొందుపరిచింది. డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఈ ఫోన్‍కు ఉంటాయి.

Realme 10 Pro+ 5G Price : రియల్‍మీ 10 ప్రో+ 5జీ ధర

చైనీస్ మార్కెట్‍లో రియల్‍మీ 10 ప్రో+ 5జీ మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర 1,699 యువాన్లు (సుమారు రూ.19,400), 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,999 యువాన్లు (సుమారు రూ.22,800), 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.26,200)గా ఉంది. నైట్ బ్లాక్, స్టార్ లైట్, సీ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లాంచ్ అయింది.

Realme 10 Pro Series launch in India: రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ ఇండియాలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్‍లో రియల్‍మీ 10 ప్రో+, రియల్‍మీ 10 ప్రో వచ్చే నెలలో అడుగుపెడతాయని అంచనాలు వస్తున్నాయి.

WhatsApp channel