OnePlus 11 details: సరికొత్త ఫీచర్లతో వన్ ప్లస్ 11; మార్కెట్లోకి ఎప్పుడంటే..?-oneplus 11 leaks surface online likely to use this soc all details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oneplus 11 Leaks Surface Online, Likely To Use This Soc: All Details Here

OnePlus 11 details: సరికొత్త ఫీచర్లతో వన్ ప్లస్ 11; మార్కెట్లోకి ఎప్పుడంటే..?

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 08:21 PM IST

OnePlus 11 details: చైనా దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్(OnePlus) లేటెస్ట్ సిరీస్ మొబైల్ వన్ ప్లస్ 11(OnePlus 11) వివరాలు లీక్ అయ్యాయి. ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన ఆ OnePlus ఫ్లాగ్ షిప్ మోడల్ డిటైల్స్ ఇవిగో..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

OnePlus 11 details: ఈ OnePlus 11 మొబైల్ 5G టెక్నాలజీతో వస్తోంది. ఈ అడ్వాన్స్్డ మోడల్ మొబైల్ లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ(Qualcomm Snapdragon 8 Gen 2 SoC)ని వినియోగించారు.

ట్రెండింగ్ వార్తలు

OnePlus 11 details: పూర్తి AI ఇంటిగ్రేషన్

ఈ OnePlus 11 5G మొబైల్ ను 8 Gen 2 processor సహకారంతో పూర్తిగా కృత్రిమ మేథ(AI) టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేశారు. అలాగే, AI ఇంజిన్ తో క్వాల్ కామ్ హెగ్జాగాన్ ప్రాసెసర్ ను అనుసంధానించారు. దానివల్ల అత్యంత వేగవంతమైన ప్రాసెసింగ్ సాధ్యమవుతుంది. ఈ క్వాల్ కామ్ చిప్ సెట్ ప్రస్తుతం వన్ ప్లస్ మొబైల్స్ తో వాడుతున్న చిప్ సెట్ ల కన్నా 40% మరింత శక్తిమంతంగా పని చేస్తుంది. అడ్రెనో జీపీయూ(Adreno GPU) , క్రయో సీపీయూ(Kryo CPU)లతో గేమింగ్ పర్ఫార్మెన్స్ లో ఇది తిరుగు లేని పని తీరును కనబరుస్తుంది.

OnePlus 11 details: 6.7 అంగుళాల స్క్రీన్

వన్ ప్లస్ నుంచి వస్తున్న ఈ వన్ ప్లస్ 11 మొబైల్ లో 6.7 అంగుళాల QHD+ AMOLED స్క్రీన్ ను అమర్చారు. దీని రిఫ్రెష్ రేటు 120 హెర్జ్. పై భాగంలోని పంచ్ హోల్ కెమెరా కట్(punch-hole camera cut) మొబైల్ కు స్టైలిష్ లుక్ తీసుకువచ్చింది. ఈ ఫోన్ లో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ను ఏర్పాటుచేశారు. ఈ ఫోన్ లో 48 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2*32 ఎంపీ టెలీఫొటో లెన్స్ లతో 50 ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను అమర్చారు. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.

OnePlus 11 details: ఆండ్రాయిడ్ 13

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. ఇందులో 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అలాగే, ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు. ఈ ఫోన్ కు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. కనెక్టివిటీ కోసం వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, టైప్ సీ యూఎస్ బీ ఉన్నాయి. వచ్చే సంవత్సరం జూన్ లోపు ఈ ఫోన్ ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశముంది.

WhatsApp channel