Noise Scout: పిల్లల కోసం నాయిస్ ప్రత్యేక స్మార్ట్‌వాచ్: 4జీ సిమ్ సపోర్ట్, వీడియో కాలింగ్ సహా మరిన్ని ప్రత్యేకతలతో..-noise scout smartwatch launched for kids with special features and affordable price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Noise Scout: పిల్లల కోసం నాయిస్ ప్రత్యేక స్మార్ట్‌వాచ్: 4జీ సిమ్ సపోర్ట్, వీడియో కాలింగ్ సహా మరిన్ని ప్రత్యేకతలతో..

Noise Scout: పిల్లల కోసం నాయిస్ ప్రత్యేక స్మార్ట్‌వాచ్: 4జీ సిమ్ సపోర్ట్, వీడియో కాలింగ్ సహా మరిన్ని ప్రత్యేకతలతో..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 15, 2023 01:29 PM IST

Noise Scout Smartwatch: పిల్లల కోసం నాయిస్ స్కౌట్ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. 4జీ సిమ్ సపోర్ట్, కెమెరా సహా మరిన్ని స్పెషల్ ఫీచర్లతో ఈ వాచ్ వస్తోంది.

Noise Scout: పిల్లల కోసం నాయిస్ ప్రత్యేక స్మార్ట్‌వాచ్ (Photo: Noise)
Noise Scout: పిల్లల కోసం నాయిస్ ప్రత్యేక స్మార్ట్‌వాచ్ (Photo: Noise)

Noise Scout Smartwatch: దేశీయ కంపెనీ నాయిస్ (Noise).. పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ స్మార్ట్‌వాచ్ (Kids Smartwatch) తీసుకొచ్చింది. స్పెషల్ ఫీచర్లతో నాయిస్ స్కౌట్ వాచ్‍ను లాంచ్ చేసింది. 4జీ సిమ్ సపోర్ట్, వన్ వే వీడియో కాలింగ్, టూ వే ఆడియో కాలింగ్ సహా మరిన్ని సదుపాయాలు ఈ వాచ్‍లో ఉంటాయి. Noise Scout Smartwatch పూర్తి వివరాలు ఇవే.

నాయిస్ స్కౌట్ వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Noise Scout Smartwatch Specifications: బుల్ట్ ఇన్ జీపీఎస్, జియో ఫెన్సింగ్ టెక్నాలజీని ఈ నాయిస్ స్కౌట్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. దీంతో ఈ వాచ్ ధరించిన పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నారన్న విషయాన్ని తమ ఫోన్ ద్వారా పేరెంట్స్ తమ ఫోన్‍లో తెలుసుకోవచ్చు. రియల్‍ టైమ్ లొకేషన్ డేటాను చూడవచ్చు. జీఎస్ఎన్, ఏజీపీఎస్‍లకు సపోర్ట్ చేస్తుంది. పిల్లలకు సేఫ్ జోన్‍ను సెట్ చేసి.. ఆ ప్రాంతం దాటి వెళితే తమ ఫోన్‍కు నోటిఫికేషన్ వచ్చేలా పేరెంట్స్ సెట్ చేసుకోవచ్చు.

Noise Scout Smartwatch: 4జీ సిమ్‍కు ఈ నాయిస్ స్కౌట్ వాచ్ సపోర్ట్ చేస్తుంది. టూ వే కాలింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. పిల్లల వద్ద ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు. వాచ్ నుంచి కాల్ చేయవచ్చు. అలాగే వన్‍వే వీడియో కాలింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇందుకోసం ఈ వాచ్‍కు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

పేరెంట్స్ తమ ఫోన్‍లో నాయిస్ బడ్డీ యాప్‍ (Noise Buddy App)ను ఇన్‍స్టాల్ చేసుకొని పిల్లలకు ఇచ్చే ఈ నాయిస్ స్కౌట్ వాచ్‍ను సింక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను పొందవచ్చు.

Noise Scout Smartwatch: 1.4 ఇంచుల IPS LCD డిస్‍ప్లేను నాయిస్ స్కౌట్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. 150 కంటే ఎక్కువ క్లౌడ్ బేస్ట్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంటర్ హెల్త్ ఫీచర్లతో ఈ వాచ్ వస్తోంది.

Noise Scout: ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‍ను ఈ నాయిస్ స్కౌట్ స్మార్ట్‌వాచ్ ఇస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.

నాయిస్ స్కౌట్ స్మార్ట్‌వాచ్ ధర, సేల్

Noise Scout Smartwatch Price: నాయిస్ స్కౌట్ స్మార్ట్‌వాచ్ ధర రూ.5,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, నాయిస్ కంపెనీ వెబ్‍సైట్‍లో ఈ వాచ్‍ను కొనుగోలు చేయవచ్చు. ట్వింకిల్ పర్పుల్, రేసింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం