LPG Price Cut: ఎల్‍పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. కానీ!-lpg price cut 19 kg lpg commercial cylinder price slashes know latest rates ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lpg Price Cut 19 Kg Lpg Commercial Cylinder Price Slashes Know Latest Rates

LPG Price Cut: ఎల్‍పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. కానీ!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 01, 2023 10:15 AM IST

LPG Price Cut: కమర్షియల్ ఎల్‍పీజీ సిలిండర్ ధర తగ్గింది. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేటులో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

LPG Price Cut: ఎల్‍పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. కానీ! (HT Photo)
LPG Price Cut: ఎల్‍పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. కానీ! (HT Photo)

LPG Price Cut: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‍పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను నేడు (జూన్ 1) సవరించాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ ఎల్‍పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. కానీ, ఇళ్లలో వినియోగించే డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ ఎల్‍పీజీ సిలిండర్ ధరల్లో మార్పు లేదు. కమర్షియల్‍గా వినియోగించే 19కేజీల ఎల్‍పీజీ సిలిండర్ ధర రూ.83.50 తగ్గింది. దీంతో జూన్ 1 నుంచి ఢిల్లీలో ఎల్‍పీజీ కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,773గా ఉంటుంది. గత నెల ఈ ధర రూ.1,856.50గా ఉండేది. సాధారణంగా ప్రతీ నెల 1వ తేదీ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు సవరిస్తుంటాయి. అందులో భాగంగానే ఈ నెల కమర్షియల్ ఎల్‍పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

ట్రెండింగ్ వార్తలు

ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,725కు తగ్గింది. కోల్‍కతాలో రూ.1,875.50, చెన్నైలో రూ.1,937కు చేరింది. నేటి నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయి. ఈ సంవత్సరం కమర్షియల్ సిలిండర్ల ధరలు మూడుసార్లు పెరుగగా.. మూడుసార్లు తగ్గాయి. ఏప్రిల్ నుంచి కమర్షియల్ గ్యాస్ ధరలు కిందికి వస్తున్నాయి. దీంతో వ్యాపారాలకు ఊరట లభించింది.

గృహాల్లో ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఈసారి మార్పు లేదు. దీంతో చాలా మంది సామాన్యులకు ఊరట దక్కలేదు. 14.2 కేజీలు ఉండే డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103గా ఉంది. హైదరాబాద్‍లో రూ.1,155గా ఉంది. స్థానిక వ్యాట్‍ ఆధారంగా రాష్ట్రాలను బట్టి గ్యాస్ సిలిండర్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. డొమెస్టిక్ సిలిండర్ల ధర చివరగా మార్చిలో 1న మారింది. అప్పట్లో సిలిండర్ ధరపై రూ.50 ధర పెరిగింది.

తగ్గిన విమాన ఇంధన ధరలు

విమానాలకు వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్ (ఏటీఎఫ్) ధరలు కూడా దేశంలో నేడు తగ్గాయి. ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.89,303.09కు చేరింది. గత నెలలో ఇది రూ.95,935గా ఉండేది. అంతర్జాతీయ మారకం రేట్లను బట్టి ఈ జెట్ ఫ్యూయల్ రేట్లను కూడా కంపెనీలు ప్రతీ నెల సవరిస్తుంటాయి.

WhatsApp channel

టాపిక్