senior citizens savings schemes: ఈ వడ్డీ రేట్ల పెంపుతో సీనియర్ సిటిజన్లకు పండుగే-its time for senior citizens to lock the 8 percent interest rate on scss ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  It's Time For Senior Citizens To Lock The 8 Percent Interest Rate On Scss

senior citizens savings schemes: ఈ వడ్డీ రేట్ల పెంపుతో సీనియర్ సిటిజన్లకు పండుగే

HT Telugu Desk HT Telugu
Jan 05, 2023 10:38 PM IST

senior citizens savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన సీనియర్ సిటిజన్లకు శుభవార్త. వారు తమ పెట్టుబడులకు మంచి వడ్డీని పొందనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Mint)

senior citizens savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలు భారత్ లో చాలా పాపులర్. రిస్క్ లేని, మెరుగైన రిటర్న్స్ ను ఇచ్చే పథకాలివి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ డబ్బును వీటిలో పెడుతుంటారు.

senior citizens savings schemes: వడ్డీ పెంపు..

ప్రస్తుతం ఐదు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటు పెరిగింది. అవి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(Senior Citizen Savings Scheme SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (National Savings Certificate NSC), మంత్లీ ఇన్ కం సేవింగ్స్ స్కీమ్(Monthly Income Savings Scheme), కిసాన్ వికాస్ పత్ర(Kisan Vikas Patra KVP), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్స్(post office time deposits). ఈ ఐదు పొదుపు పథకాల వడ్డీ రేటును 2023 జనవరి - మార్చి త్రైమాసికానికి 20 నుంచి 110 బేసిస్ పాయింట్ల వరకు పెంచారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1%గా, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6% గా కొనసాగుతుంది.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్( SCSS)

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(Senior Citizen Savings Scheme SCSS) వడ్డీ రేటు ను 40 బేసిస్ పాయింట్లు పెంచారు. దాంతో ఈ స్కీమ్ వార్షిక వడ్డీ 8 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్లు తమ డబ్బును భద్రంగా, మెరుగైన రిటర్న్స్ ఇచ్చే పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, SCSS నే సరైన పథకమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ SCSS లో పెట్టిన పెట్టుబడులకు వచ్చే వడ్డీ ఆదాయ పన్ను పరిధిలోనికి వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. SCSS లో 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. వడ్డీని ప్రతీ మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు.

Post office deposits: పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ల వార్షిక వడ్డీ రేటును కూడా గణనీయంగా పెంచారు. వీటి వార్షిక వడ్డీ 110 బేసిస్ పాయింట్ల వరకు పెరిగింది. ఈ డిపాజిట్లను 1 లేదా 2 లేదా 3 సంవత్సరాల కాల పరిమితితో పెట్టవచ్చు.

WhatsApp channel