iQoo Z7s 5G: ఐకూ నుంచి నయా 5జీ ఫోన్ వచ్చేసింది: రూ.20వేలలోపు ధరలో..: పూర్తి వివరాలివే-iqoo z7s 5g price in india specifications offers save begins via amazon check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iqoo Z7s 5g: ఐకూ నుంచి నయా 5జీ ఫోన్ వచ్చేసింది: రూ.20వేలలోపు ధరలో..: పూర్తి వివరాలివే

iQoo Z7s 5G: ఐకూ నుంచి నయా 5జీ ఫోన్ వచ్చేసింది: రూ.20వేలలోపు ధరలో..: పూర్తి వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
May 22, 2023 02:44 PM IST

iQoo Z7s 5G: ఐకూ జెడ్7ఎస్ 5జీ ఫోన్ భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. ఇప్పటికే సేల్ మొదలైంది. రూ.1,500 డిస్కౌంట్ పొందేలా ప్రస్తుతం ఆఫర్ కూడా ఉంది.

iQoo Z7s 5G: ఐకూ నుంచి నయా 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది: రూ.20వేలలోపు ధరలో.. (Photo: iQoo)
iQoo Z7s 5G: ఐకూ నుంచి నయా 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది: రూ.20వేలలోపు ధరలో.. (Photo: iQoo)

iQoo Z7s 5G laucned in India: ప్రముఖ బ్రాండ్ ఐకూ (iQoo) నుంచి జెడ్7 సిరీస్‍లో మరో 5జీ స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టింది. ఐకూ జెడ్7ఎస్ 5జీ (iQoo Z7s 5G) మొబైల్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. అమోలెడ్ డిస్‍ప్లే, స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వచ్చింది. 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పటికే సేల్ కూడా మొదలైంది. రూ.1,500 డిస్కౌంట్ పొందేలా బ్యాంక్ కార్డు డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐకూ జెడ్7ఎస్ పూర్తి వివరాలు ఇవే.

ఐకూ జెడ్7ఎస్ 5జీ పూర్తి స్పెసిఫికేషన్లు

iQoo Z7s 5G Specifications: ఐకూ జెడ్ 7ఎస్ ఫోన్ 6.38 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ (AMOLED) డిస్‍ప్లేతో వచ్చింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటాయి. ఇన్‍డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

iQoo Z7s 5G: ఐకూ జెడ్7ఎస్ 5జీ మొబైల్ వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉండే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వచ్చింది.

iQoo Z7s 5G: స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఈ ఐకూ జెడ్7ఎస్ 5జీ ఫోన్‍లో ఉంది. 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. అల్ట్రా గేమ్ మోడ్, మోషన్ కంట్రోల్స్ లాంటి గేమింగ్ ఫీచర్లు ఉంటాయి.

iQoo Z7s 5G: ఐకూ జెడ్7ఎస్ 5జీ ఫోన్‍లో 4,500mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 24 నిమిషాల్లోనే ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని ఐకూ పేర్కొంది. నీటి తుంపర్ల నుంచి రక్షణ ఉండేలా ఐపీ54 రేటింగ్‍ను ఈ ఫోన్ కలిగి ఉంది.

ఐకూ జెడ్7ఎస్ 5జీ ధర, సేల్, ఆఫర్లు

iQoo Z7s 5G Price, Sale: ఐకూ జెడ్7ఎస్ మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.18,999, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍, ఐకూ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ ఫోన్ ఇప్పటికే సేల్‍కు వచ్చింది. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్‍లో లభిస్తోంది.

iQoo Z7s 5G Offer: ఐకూ జెడ్7ఎస్ 5జీ ఫోన్‍ను ప్రస్తుతం అమెజాన్‍లో హెచ్‍డీఎఫ్‍సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఐకూ వెబ్‍సైట్‍లో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై ఈ ఆఫర్ ఉంది.

WhatsApp channel