Instagram Dynamic Profile Photo: ఈ కొత్త ఫీచర్ ఎందుకు, ఎలా ఉపయోగించాలంటే!-instagram gets new dynamic profile photo feature know how to use ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Instagram Gets New Dynamic Profile Photo Feature Know How To Use

Instagram Dynamic Profile Photo: ఈ కొత్త ఫీచర్ ఎందుకు, ఎలా ఉపయోగించాలంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 25, 2023 12:45 PM IST

Instagram Dynamic Profile Photo: డైనమిక్ ప్రొఫైల్ ఫొటో ఫీచర్‌ను ఇన్‍స్టాగ్రామ్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుంది.. ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Instagram Dynamic Profile Photo: ఈ కొత్త ఫీచర్ ఎలా ఎందుకు, ఎలా ఉపయోగించాలంటే!
Instagram Dynamic Profile Photo: ఈ కొత్త ఫీచర్ ఎలా ఎందుకు, ఎలా ఉపయోగించాలంటే! (AP)

Instagram Dynamic Profile Photo: ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‍ఫామ్ ఇన్‍స్టాగ్రామ్ (Instagram).. కొత్తగా డైనమిక్ ప్రొఫైల్ ఫొటో ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ నయా సదుపాయాన్ని లాంచ్ చేసింది. దీని ద్వారా యూజర్లు ప్రొఫైల్ ఫొటోలో.. ఫొటోతో పాటు అవతార్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంతకాలం ప్రొఫైల్ ఫొటోగా ఫొటో లేదా అవతార్‌ ఒకదాన్నే సెట్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ డైనమిక్ ప్రొఫైల్ ఫొటో ద్వారా ఫొటో, అవతార్ రెండు ఫ్లిప్ అవుతూ ప్రొఫైల్ ఫొటోలా కనిపిస్తాయి. దీన్ని ఎలా వాడాలంటే..

ట్రెండింగ్ వార్తలు

Instagram Dynamic Profile Photo: కొత్త ఫీచర్‌ను ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఇన్‍స్టాగ్రామ్ ప్రకటించింది. “మీ పిక్చర్‌కు ఇంకో సైడ్ ఇప్పుడు మీరు అవతార్‌ను యాడ్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్‍ను విజిట్ చేసే యూజర్లు ఫొటో, అవతార్ రెండింటినీ ఫ్లిప్ చేయవచ్చు” అని ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ చేసింది.

Instagram Dynamic Profile Photo: ఇన్‍స్టాగ్రామ్‍లో అవతార్‌ను ఎలా క్రియేట్, ఎడిట్ చేయాలి

  • ముందుగా మీ స్మార్ట్ ఫోన్‍లో ఇన్‍స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత మీ ప్రొఫైల్‍లోకి వెళ్లి.. ఎడిట్ ప్రొఫైల్‍పై ట్యాప్ చేయండి.
  • అక్కడ ప్రొఫైల్ పిక్చర్, అవతార్ రెండూ పక్కపక్కనే కనిపిస్తాయి.
  • అవతార్‌పై ట్యాప్ చేసి.. క్రియేట్ చేసుకోవచ్చు. అవతార్ స్కిన్ టోన్, హెయిర్ స్టైల్, ఔట్‍ఫిట్‍తో పాటు మరిన్ని ఎడిట్ చేసుకోవచ్చు.
  • అవతార్‌ను క్రియేట్ చేయడం పూర్తయ్యాక డన్‍పై ట్యాప్ చేసి సేవ్ చేంజెస్ ఆప్షన్‍ను ఎంపిక చేసుకోవాలి. అంతే అవతార్ క్రియేట్ అవుతుంది.
  • ఈ ఇన్‍స్టాగ్రామ్ డైనమిక్ ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేసుకున్నాక.. ఎవరైనా యూజర్ మీ ప్రొఫైల్‍లోకి వచ్చినప్పుడు ప్రొఫైల్ ఫొటోపై స్వైప్ చేసి అవతార్‌ను కూడా చూడవచ్చు.

ఒకేవేళ ఇంతకు ముందు మీరు ఫేస్‍బుక్‍లో అవతార్‌ను క్రియేట్ చేసుకొని ఉన్నా.. దాన్ని కూడా ఇన్‍స్టాగ్రామ్ కోసం ఉపయోగించుకోవచ్చు.

కాగా, ఇన్‍స్టాగ్రామ్ అతివినియోగాన్ని, యూజర్ల స్క్రీన్ టైమ్‍ను తగ్గించేందుకు ఇటీవల ఇన్ క్విట్ మోడ్‍ను ఇటీవలే ఆ ప్లాట్‍ఫామ్ తీసుకొచ్చింది.

WhatsApp channel

సంబంధిత కథనం