Infinix Hot 20 5G India launch date: బడ్జెట్ రేంజ్‍లో ఇన్ఫినిక్స్ కొత్త 5జీ ఫోన్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇవే..-infinix hot 20 5g smartphone india launch date officially revealed know full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Infinix Hot 20 5g Smartphone India Launch Date Officially Revealed Know Full Details

Infinix Hot 20 5G India launch date: బడ్జెట్ రేంజ్‍లో ఇన్ఫినిక్స్ కొత్త 5జీ ఫోన్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇవే..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 22, 2022 02:19 PM IST

Infinix Hot 20 5G India launch date: ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, అంచనా ధర ఎలా ఉన్నాయంటే..

Infinix Hot 20 5G India launch date: బడ్జెట్ రేంజ్‍లో ఇన్ఫినిక్స్ కొత్త 5జీ ఫోన్ (Photo: Infinix)
Infinix Hot 20 5G India launch date: బడ్జెట్ రేంజ్‍లో ఇన్ఫినిక్స్ కొత్త 5జీ ఫోన్ (Photo: Infinix)

Infinix Hot 20 5G India launch date: చైనీస్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ కూడా వరుసగా స్మార్ట్‌ఫోన్‍లను తెస్తోంది. ఈ క్రమంలో భారత్‍లో మరో 5జీ మొబైల్‍ను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ ఫోన్‍ను బడ్జెట్ రేంజ్‍లో తీసుకురానుంది. డిసెంబర్ 1వ తేదీన ఈ ఫోన్‍ను ఇండియాలో లాంచ్ చేయనన్నట్టు ఇన్ఫినిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల గ్లోబల్‍గా విడుదలైన ఈ ఫోన్‍ను ఇప్పుడు భారత్‍కు తెస్తోంది. ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Infinix Hot 20 5G launch details: ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ లాంచ్ వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ సిరీస్‍ను డిసెంబర్ 1న భారత్‍లో లాంచ్ చేయనున్నట్టు ఇన్ఫినిక్స్ ఇండియా ప్రకటించింది. అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. టీజర్ ను కూడా పోస్ట్ చేసింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

Infinix Hot 20 5G Specifications: ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ స్పెసిఫికేషన్లు

గ్లోబల్‍గా ఇప్పటికే లాంచ్ అవటంతో ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ స్పెసిఫికేషన్లు ఇప్పటికే బయటికి వచ్చాయి. 6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లేతో ఈ మొబైల్ రానుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టమ్‍తో లాంచ్ అవుతుంది. ఎస్డీ కార్డ్ స్లాట్ ఈ మొబైల్ లో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉండనున్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇన్ఫినిక్స్ ఈ ఫోన్‍కు ఇస్తోంది. ఈ మొబైల్‍లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుండగా.. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ను పవర్ బటన్‍కే ఇవ్వనుంది ఇన్ఫినిక్స్.

Infinix Hot 20 5G Expected Price: ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ అంచనా ధర

గ్లోబల్ మార్కెట్‍లో ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ ధర 179.9 డాలర్లుగా (సుమారు రూ.15,000) ఉంది. ఇండియాలోనూ రూ.15వేల దరిదాపుల్లోనే ఈ మొబైల్ ధర ఉంటుందని అంచనా. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‍తో ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ అడుగుపెట్టనుంది.

WhatsApp channel