Top picks by IIFL Securities: కనీసం 20% లాభాలు ఇచ్చే ఈ స్టాక్స్ పై ఓ లుక్కేయండి-indusind bank emami among top picks by iifl securities
Telugu News  /  Business  /  Indusind Bank, Emami Among Top Picks By Iifl Securities
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (iStock)

Top picks by IIFL Securities: కనీసం 20% లాభాలు ఇచ్చే ఈ స్టాక్స్ పై ఓ లుక్కేయండి

31 December 2022, 20:03 ISTHT Telugu Desk
31 December 2022, 20:03 IST

Top picks by IIFL Securities: వచ్చే సంవత్సరం కనీసం 20% లాభాలను ఇచ్చే కొన్ని స్టాక్స్ ను IIFL Securities సిఫారసు చేస్తోంది. ఆ కంపెనీలేంటో చూడండి..

2022 ను పరిశీలిస్తే, స్టాక్ మార్కెట్ అనూహ్య నష్టాలను చవి చూసింది. అదే సమయంలో అంతే వేగంగా రికవరై, లాభాల బాట పట్టింది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితి స్టాక మార్కెట్ కు సాధారణమే అయినా, అలాంటి పరిస్థితి 2022లో తరచుగా కనిపించింది.

Top picks by IIFL Securities: ఈ స్టాక్స్ బెటర్..

అందువల్ల 2023లో స్టాక్ మార్కెట్ ఎదుర్కోబోయే ఒడిదుడుకులను దృష్టిలో పెట్టుకుని కనీసం 20% లాభాలను ఇచ్చే అవకాశమున్న కొన్ని స్టాక్స్ ను దేశీ బ్రోకరేజ్ సంస్థ ‘ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్(IIFL Securities)’ సూచిస్తోంది. అవి

  • ఈక్విటాస్ స్మాల్ సేవింగ్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank):

ఈ స్మాల్ సేవింగ్స్ బ్యాంక్ షేర్ ధర ప్రస్తుతం రూ. 58 ల స్థాయిలో ఉంది. ఈ స్టాక్ సమీప భవిష్యత్తులో కనీసం రూ. 68 కి చేరుతుందని IIFL Securities అంచనా వేస్తోంది. లాంగ్ రన్ లో ఈ షేర్ మల్టీ బ్యాగర్ గా అవతరించే అవకాశం ఉందని సూచిస్తోంది. ఈ బ్యాంక్ డిపాజిట్లలో వృద్ధి, ఎన్పీఏల నిర్వహణ సమర్ధవంతంగా ఉందని తెలిపింది.

  • ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank)

ఈ బ్యాంక్ షేర్ ప్రస్తుత విలువ సుమారు రూ. 1170 నుంచి రూ. 1210 మధ్య ఉంది. సమీప భవిష్యత్తులో ఇది రూ. 1428కి చేరుకునే అవకాశముందని IIFL Securities అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2QFY23)లో ఈ బ్యాంక్ (IndusInd Bank) లాభం రూ. 18.1 బిలియన్లు. విశ్లేషకుల అంచనాను మించి ఈ బ్యాంక్ లాభాలను ఆర్జించింది. బ్యాంక్ లోన్ బై డిపాజిట్ వృద్ధి ప్రశంసనీయంగా ఉంది.

  • పీబీ ఫిన్ టెక్ (PB Fintech)

ఈ సంస్థ షేర్ ప్రస్తుత మార్కెట్ ధర తో పోలిస్తే, టార్గెట్ ప్రైస్ 22% అధికంగా ఉంది. ప్రస్తుతం PB Fintech షేర్ ధర రూ. 453 గా ఉంది. దీని 12 నెలల టార్గెట్ ప్రైస్ రూ. 552 అని IIFL Securities అంచనా వేస్తోంది. ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ సంవత్సరం 76% పెరిగిందని, రుణ వితరణ 92% పెరిగిందని వివరిస్తోంది.

  • ఇమామీ (Emami)

ఇమామీ సంస్థను కూడా IIFL Securities బై (buy) కేటగిరీలో చేర్చింది. ఇమామీ షేరు ప్రస్తుత మార్కెట్ ధర రూ. 420 నుంచి రూ. 440 మధ్య ఉంది. దీని టార్గెట్ ధరను రూ. 516గా IIFL Securities అంచన వేస్తోంది. రానున్న త్రైమాసికాల్లో సంస్థ ప్రొడక్ట్స్ అమ్మకాలు పెరగుతాయన్న అంచనా ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మార్కెట్లలో చొచ్చుకుపోయే దిశగా సంస్థ చేపట్టిన వ్యూహాలు సమీప భవిష్యత్తులో సత్ఫలితాలు ఇచ్చే అవకాశముందని భావిస్తోంది.