IndiGo flight tickets sale: రెండు వేలకే విమాన యానం; చెక్ చేసుకోండి ‘ఇండిగో’ ఆఫర్-indigo announces sale check flight tickets and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Indigo Announces Sale. Check Flight Tickets And Other Details Here

IndiGo flight tickets sale: రెండు వేలకే విమాన యానం; చెక్ చేసుకోండి ‘ఇండిగో’ ఆఫర్

HT Telugu Desk HT Telugu
Dec 23, 2022 10:46 PM IST

IndiGo offer: దేశీ విమాన యాన సంస్థ `ఇండిగో` కొత్త సంవత్సరం సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్ ను ప్రకటించింది. రూ. 2 వేల కనీస ధరకే విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IndiGo offer: స్పెషల్ హాలీడే సేల్ కింద ఇండిగో ఈ ఆఫర్ ను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఈ ఆఫర్ ను పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

IndiGo offer: మూడు రోజుల పాటు సేల్

ఈ సేల్ డిసెంబర్ 23 నుంచి మూడు రోజుల పాటు, అంటే డిసెంబర్ 25 అర్ధరాత్రి వరకు ఉంటుంది. దేశీయ ప్రయాణాల టికెట్ ధర రూ. 2,023 నుంచి ప్రారంభమవుతోంది. అలాగే, అంతర్జాతీయ ప్రయాణాలకు టికెట్ ధర రూ. 4,999 నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణాలను ప్లాన్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

IndiGo offer: ఇండిగో వెబ్ సైట్ నుంచి..

ఈ సేల్ వివరాలను ఇండిగో అఫీషియల్ వెబ్ సైట్ లో పరిశీలించవచ్చు. వివిధ మార్గాల్లోని విమాన సర్వీసుల్లో లిమిటెడ్ సీట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అందువల్ల, సీట్ల అందుబాటును బట్టి డిస్కౌంట్ లభించే అవకాశముంది. ఈ ఆఫర్ కు సంబంధించి తుది నిర్ణయం ఇండిగో విమాన యాన సంస్థకే ఉంటుంది. ఈ డిస్కౌంట్ తో పాటు హెచ్ ఎస్ బీసీ(HSBC bank) బ్యాంక్ నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

WhatsApp channel

టాపిక్