Multibagger Diwali stock picks: ఈ 5 ఏడాదిలో మీ పెట్టుబడి డబుల్ చేయొచ్చు..-iifl research recommends multibagger diwali stock picks for muhurat session ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Iifl Research Recommends Multibagger Diwali Stock Picks For Muhurat Session

Multibagger Diwali stock picks: ఈ 5 ఏడాదిలో మీ పెట్టుబడి డబుల్ చేయొచ్చు..

HT Telugu Desk HT Telugu
Oct 24, 2022 09:49 AM IST

Multibagger diwali stocks: ఫెడరల్ బ్యాంక్, ఐహెచ్‌సీఎల్, రేణుకా షుగర్స్, డీఎల్ఎఫ్, కోల్ ఇండియా స్టాక్స్‌లను ముహురత్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేయాల్సిన మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా అనూజ్ గుప్తా రెకమెండ్ చేస్తున్నారు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయం
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయం (REUTERS)

Multibagger Diwali stock picks: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సెషన్ ఈ రోజు సాయంత్రం 6.15 నుంచి 7.15 వరకు కొనసాగుతుంది. కొత్త సంవత్ (దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకు ఉండే సంవత్సరం) రోజు ట్రేడింగ్ చేయడం వల్ల ఏడాదంతా మంచి జరుగుతుందని ఇన్వెస్టర్ల నమ్మకం. అందుకే మంచి రాబడుల కోసం ఈ రోజు ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Muhurat trading stocks 2022: సిఫారసులు ఇవే..

ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అనూజ్ గుప్తా కొన్ని స్టాక్స్ ఇప్పటికే మంచి ఫలితాలు ఇచ్చాయని, సానుకూల త్రైమాసిక ఫలితాలతో రాబడులను కొనసాగిస్తాయని సూచించారు. అంతేకాకుండా ఛార్ట్ ఫార్మేషన్‌లో కూడా వీటిలో కొన్ని సానుకూలంగా ఉన్నాయని వివరించారు. రానున్న ఏడాది కాలంలో 5 స్టాక్స్ మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా అవతరించబోతున్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఫెడరల్ బ్యాంక్, రేణుకా షుగర్స్, కోల్ ఇండియా, డీఎల్ఎఫ్, ఇండియన్ హోటల్స్ కంపెనీ ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ ఐదు స్టాక్స్‌పై ఐఐఎఫ్ఎల్ విశ్లేషణ ఇదే..

1] Federal Bank: ఈ బ్యాంకింగ్ స్టాక్ హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఛార్ట్ ఫార్మేషన్ కలిగి ఉంది. వచ్చే దీపావళి నాటికి రూ. 230 టార్గెట్ ధరగా పెట్టుకుని ఇన్వెస్టర్లు ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చని ఐఐఎఫ్ఎల్ సిఫారసు చేసింది. ప్రస్తుత స్థాయిల్లో ఎప్పుడు పతనమైనా కొనుగోలు చేసుకుంటూ ముందుకు సాగవచ్చని చెబుతోంది.

2] Renuka Sugar: ఇథనాల్‌కు పెరిగిన డిమాండ్ కారణంగా, చక్కెర ఎగుమతులు పెరిగిన కారణంగా షుగర్ స్టాక్స్ రాణిస్తాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ విశ్లేషించింది. రేణుకా షుగర్స్ షేర్లు బలమైన ఛార్ట్ పాటర్న్ కలిగి ఉన్నాయని విశ్లేషించింది. ఏడాది టార్గెట్ ధర రూ. 120గా పెట్టుకుని ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చని రెకెమెండ్ చేసింది.

3] Coal India Ltd or CIL: కోల్ ఇండియా పీఎస్‌యూ కంపెనీ స్టాక్. పూర్తిగా రుణ రహిత సంస్థ. మంచి డివిడెంట్స్ ఇస్తుంది. ఛార్ట్ పాటర్న్‌లో ప్రస్తుతం ట్రయాంగిల్ ఫార్మేషన్ కలిగి ఉంది. అంటే స్ట్రాంగ్ అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న రూ. 238 స్థాయి నుంచి రూ. 500 వరకు వెళ్లొచ్చని అనూజ్ గుప్తా విశ్లేషించారు.

4] DLF: విలాసవంతమైన నివాసాలకు డిమాండ్ పెరుగుతున్నందున ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పటిష్టమైన త్రైమాసిక ఫలితాలు వెలువరించింది. ఈ స్టాక్‌ను ఏడాది కాలంలో టార్గెట్ ధర రూ. 600గా పెట్టుకుని ప్రస్తుత స్థాయిల్లో కొనుగోలు జరపవచ్చని సిఫారసు చేశారు. రూ. 265 స్థాయి వెళ్లే వరకు కొనుగోళ్లు జరుపుతూ ఉండొచ్చని సూచించారు.

5] Indian Hotels Company: కోవిడ్ అనంతరం డిమాండ్ అమాంతం పెరగడంతో టాటా గ్రూప్‌నకు చెందిన ఈ హోటల్ కంపెనీ మార్జిన్లను మెరుచుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ స్టాక్ హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఛార్ట్ ఫార్మేషన్ కలిగి ఉన్నందున బుల్లిష్ ట్రెండ్ కనబరచనుంది. ప్రస్తుత స్థాయిలో ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చని, ఏడాది కాలానికి టార్గెట్ ధర రూ. 500గా ఉంటుందని సిఫారసు చేశారు. రూ. 255 స్థాయి వరకు కొనుగోళ్లు జరుపుతూ ఉండొచ్చని సూచించారు.

Disclaimer: స్టాక్స్‌పై అభిప్రాయాలు, సిఫారసులు వ్యక్తిగత అనలిస్టులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు. నిపుణుల సలహా మేరకు, లేదా వ్యక్తిగత నైపుణ్యాన్ని అనుసరించి మాత్రమే పెట్టుబడులు పెట్టడం మేలు.

WhatsApp channel