Honda Electric Scooter: 2023లో హోండా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్-first honda electric scooter to launch in india next year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  First Honda Electric Scooter To Launch In India Next Year

Honda Electric Scooter: 2023లో హోండా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 09:20 PM IST

Honda Electric Scooter: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా(HMSI) ప్రవేశించనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Honda Electric Scooter: ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న మార్కెట్ ను కాస్త ఆలస్యంగా గుర్తించిన హోండా సంస్థ.. 2023లో భారత మార్కెట్లోకి తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

Honda Electric Scooter: హోండా ఎలక్ట్రిక్ స్కూటర్

హోండా నుంచి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరును ఇంకా నిర్ణయించలేదు. అయితే, భారత్ లో ఘన విజయం సాధించిన యాక్టివా బ్రాండ్ పైననే దీన్ని కూడా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్(TVS iQube), బజాజ్ చేతక్(Bajaj Chetak)ల సెగ్మెంట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్ ను తీర్చిదిద్దడానికి ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. వీరికి జపాన్ లోని హోండా మాతృ సంస్థలోని నిపుణులు సహకరిస్తున్నారు.

Honda Electric Scooter: భారత్ మంచి మార్కెట్

ఎలక్ట్రిక్ వాహనాలకు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారత్ లో భవిష్యత్ లో మంచి మార్కెట్ ఉండనుంది. 2025 నాటికి ఇండియన్ ఈవీ మార్కెట్ 77% సీఏజీఆర్ గ్రోత్ ను సాధిస్తుందని అంచనా. అయితే, భారతీయ మార్కెట్లోకి తాము తీసుకురానున్న మోడల్ మిగతా కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా మెరుగైన సౌకర్యాలను అందించేలా డిజైన్ చేస్తున్నారు. బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో, కనీసం 60 కిమీల రేంజ్ తో దీనిని తీసుకురానున్నారు. నగరాల్లో రోజుకు 50 కిమీల లోపు తిరిగే వారి అవసరాలను తీర్చేలా రూపుదిద్దుతున్నారు.

WhatsApp channel