Auto sales in October : కలిసి వచ్చిన పండుగ సీజన్.. దూసుకెళ్లిన 'ఆటో' సేల్స్!
Auto sales in October 2022 : ఈ పండుగ సీజన్లో ఆటో సేల్స్ దూసుకెళ్లాయి. ప్రజల సెంటిమెంట్ కలిసి రావడంతో.. ఆటో రంగానికి పునర్వైభవం వస్తోందని మార్కెట్ భావిస్తోంది.
Auto sales in October 2022 : దేశంలో ఆటో రంగానికి పునర్వైభవం వచ్చినట్టు కనిపిస్తోంది. కొవిడ్‌తో డీలా పడిన ఆటో సెక్టార్‌కు పండుగ సీజన్ కలిసివచ్చింది! అక్టోబర్ నెలలో రీటైల్ ఆటో సేల్స్ 28శాతం పెరిగినట్టు ఫాడా(ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసొసియేషన్స్) సోమవారం వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
పండుగ సీజన్‌తో జోష్..
2 వీలర్, 3 వీలర్, ప్యాసింజర్ కార్స్, ట్రాక్టర్స్, కమర్షియల్ వెహికిల్స్.. ఇలా అన్ని సెగ్మెంట్లల సేల్స్ విషయంలో గత నెలతో పోల్చుకుంటే.. అక్టోబర్‌లో సాధారణం కన్నా ఎక్కువ వృద్ధి నమోదైంది. 2 వీలర్ సెగ్మెంట్ సేల్స్ 26శాతం, 3 వీలర్ సెగ్మెంట్లో 66శాతం, ప్యాసింజర్ కార్స్ విభాగంలో 28శాతం, ట్రాక్టర్స్ సెగ్మెంట్లో 33శాతం, కమర్షియల్ వాహనాల విభాగంలో 28శాతం వృద్ధి కనిపించింది.
అక్టోబర్‌లో.. సేల్స్‌తో పాటు యాన్యువల్ గ్రోత్ కూడా ఈ ఏడాది పెరిగింది. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే.. మొత్తం వాహనాల రీటైల్.. 48శాతం పెరగడం విశేషం.
Festival season Auto sales : "2022 అక్టోబర్‌లో ఆటో రీటైల్ 48శాతం పెరిగింది. పండుగ సీజన్ కారణంతో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ కలిసి వచ్చింది," అని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ తెలిపారు.
కొవిడ్ సంక్షోభం నుంచి ఆటో రంగం బయటపడుతున్నట్టు మనీష్ రాజ్ తెలిపారు. సమయానికి తగ్గట్టు కరోనా ఆంక్షలు కూడా తొలగిపోతుండటం కలిసి వచ్చిందని, అందకు తోడు పండుగ సీజన్ కూడా రావడంతో నూతన ఉత్సాహం లభించిందని స్పష్టం చేశారు. 2019 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో టోటల్ వెహికిల్ రీటైల్స్ వృద్ధిచెందడం ఇదే తొలిసారి అని అన్నారు.
గ్రామీణ భారతంలో డిమాండ్..
ఇంతకాలం గ్రామీణ భారతంలో సేల్స్ సరిగ్గా సాగకపోవడం ఆటో రంగాన్ని ఇబ్బంది పెట్టింది. కానీ ఇక్కడ కూడా సెంటిమెంట్ మారుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ సేల్స్ పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. కొత్త కొత్త వాహనాల లాంచ్‌లు, కస్టమర్లను ఆకర్షించే విధంగా స్కీమ్‌లను రూపొందించడంతో డిమాండ్ పెరుగుతోంది.
Tata Motors sales in October : త్రీ వీలర్ సెగ్మెంట్లో 66శాతం(ఇయర్ ఆన్ ఇయర్) వృద్ధి నమోదైంది. కానీ 2019తో పోల్చుకుంటే.. ఇది 0.6శాతం తక్కువ.
ఆటో రీటైల్లో వృద్ధి నమోదుకావాలంటే.. మరో 3-4 నెలల వరకు టూ వీలర్ సెగ్మెంట్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అయితే.. మౌలిక వసతులు, క్యాపెక్స్‌లో ఎప్పటికప్పుడు అభివృద్ధి కనిపిస్తుండటంతో.. కమర్షియల్ వాహనాల కొనుగోళ్ల జోరు కొనసాగుతుందని మార్కెట్ భావిస్తోంది.
అయితే.. కంబషన్ ఇంజిన్ నుంచి ప్రజలు నిధానంగా ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నట్టు ఫాడా నివేదికను గమనిస్తే తెలుస్తోంది.
సంబంధిత కథనం
Kia India sales: 43 శాతం పెరిగిన కియా కార్ల అమ్మకాలు
November 01 2022
Hyundai sales: హ్యుందాయ్ కార్ల జోరు.. సేల్స్ 33 శాతం అప్
November 01 2022
Tata Motors sales: టాటా మోటార్స్ సేల్స్ 15.5 శాతం జంప్
November 01 2022