Elin Electronics IPO: వచ్చేవారమే ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ-elin electronics ipo opens next week gmp review date other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Elin Electronics Ipo Opens Next Week. Gmp, Review, Date, Other Details

Elin Electronics IPO: వచ్చేవారమే ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ

HT Telugu Desk HT Telugu
Dec 17, 2022 09:23 PM IST

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగంలో భారత్ లో కీలక ప్లేయర్ గా ఉన్న ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ(Elin Electronics IPO) వచ్చేవారం ఓపెన్ కానుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Courtesy Elin Electronics Ltd website)

ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ(Elin Electronics IPO) డిసెంబర్ 20, మంగళవారం రోజు ఓపెన్ అవుతోంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగంలో భారత్ లో ఈ ఎలిన్ ఎలక్ట్రానిక్స్(Elin Electronics) కీలక ప్లేయర్ గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Elin Electronics IPO: లీడింగ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు

ఎలిన్ ఎలక్ట్రానిక్స్ భారత్ లో లీడింగ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉంది. ఎలక్ట్రానిక్స్ కు సంబంధించి దాదాపు అన్ని మేజర్ బ్రాండ్స్ కు అతి పెద్ద సప్లయర్ గా ఈ ఎలిన్ క్ట్రానిక్స్ ఉంది. లైట్స్,ఫ్యాన్స్, కిచెన్ అప్లయన్సెస్ లో ఈ సంస్థ కీలక ప్లేయర్ గా ఉంది. ఫ్రాక్షనల్ హెచ్ పీ మోటర్ల ఉత్పత్తి చేస్తున్న మేజర్ సంస్థల్లో ఎలిన్ ఎలక్ట్రానిక్స్ కూడా ఒకటి. ఎల్ ఈ డీ లైటింగ్, ఫ్లాష్ లైట్ మార్కెట్లలోనూ ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ మార్కెట్ షేరు 12%.

Elin Electronics IPO: ఐపీఓ వివరాలు

  • ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ(Elin Electronics IPO) డిసెంబర్ 20 నుంచి, డిసెంబర్ 22 వరకు సబ్ స్క్రిప్షన్ కు అందుబాటులో ఉంటుంది.
  • సంస్థ ప్రమోటర్స్ ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ను రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 234 నుంచి రూ. 247 మధ్య ఫిక్స్ చేశారు.
  • ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 475 కోట్లను సమీకరించాలని Elin Electronics భావిస్తోంది. ఇందులో రూ. 300 కోట్లను ఆఫర్ ఫర్ సేల్(Offer For Sale OFS) కోసం రిజర్వ్ చేశారు.
  • గ్రే మార్కెట్లో ఈ సంస్థ షేరు ఇప్పటికే రూ. 45 ప్రీమియం వద్ద ట్రేడ్ అవుతోంది.
  • ఈ ఐపీఓలో ఓక్కో లాట్ లో 60 షేర్లు ఉంటాయి. బిడ్డర్లు గరిష్టంగా 13 లాట్ల వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు.
  • షేర్ల అలాట్ మెంట్ డిసెంబర్ 27న ఉంటుంది.
  • బీఎస్సీ, ఎన్నెస్సీ (BSE, NSE) లలో ఈ సంస్థ స్టాక్ డిసెంబర్ 30న లిస్ట్ అవుతుంది.
  • ఈ ఐపీఓ అధికారిక రిజిస్ట్రార్ గా కేఫిన్ టెక్నాలజీస్ వ్యవహరిస్తుంది.

సూచన: ఈ సమాచారం అవగాహన కొరకు మాత్రమే. ఇన్వెస్టర్లు అన్ని కోణాల్లో పరిశీలించి, పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.

WhatsApp channel