BMW Z4 Roadster: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్-bmw z4 roadster with 335 bhp launched in india at 89 30 lakh rupees
Telugu News  /  Business  /  Bmw Z4 Roadster With 335 Bhp Launched In India At 89.30 Lakh Rupees
బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ కార్
బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ కార్

BMW Z4 Roadster: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్

25 May 2023, 14:15 ISTHT Telugu Desk
25 May 2023, 14:15 IST

ప్రీమియం కార్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీ బీఎండబ్ల్యూ (BMW) నుంచి వచ్చిన జీ 4 రోడ్ స్టర్ (Z4 Roadster) భారత్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.

ఇండియాలోని బీఎండబ్ల్యూ డీలర్స్ వద్ద ఈ ఓపెన్ టాప్ 2 సీటర్ బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ ఈ జూన్ నుంచి లభించనుంది. ఈ లగ్జరీ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 89.30 లక్షలు. ఈ కారుకు రెండు సంవత్సరాల అన్ లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ ఉంది. ఈ జీ4 రోడ్ స్టర్ లో 3.0 లీటర్, 6 సిలిండర్, ట్విన్ టర్బో చార్జ్ డ్ వీ 6 ఇంజన్ ను అమర్చారు. ఇది 8 స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్ మిషన్ తో వస్తోంది. బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ 4.5 సెకన్లలో జీరో నుంచి 100 కిమీల వేగాన్ని అందుకోగలదని కంపెనీ చెబుతోంది.

19 ఇంచ్ అలాయ్ వీల్స్

ఈ బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ కు 19 ఇంచ్ అలాయ్ వీల్స్, ఎం స్పోర్ట్స్ బ్రేక్ సిస్టమ్ ను అమర్చారు. బీఎండబ్ల్యూ కిడ్నీ గ్రిల్ కు, ఎక్స్టీరియర్ మిర్రర్ క్యాప్స్ కు, ఎగ్జాస్ట్ టెయిల్ పైప్స్ కు సీరియం గ్రే ఫినిష్ ఇచ్చారు. ఇంటీరియర్స్ కు రిచ్ లుక్ వచ్చేలా బ్లూ కాంట్రాస్ట్ స్టిచింగ్, బ్లూ పైపింగ్ తో లెదర్, అల్కాంటరా ఫినిష్ ఇచ్చారు. అలాగే, ఎం లెదర్ స్టీరింగ్ వీల్ తో పాటు ఎం స్పోర్ట్స్ సీట్స్ పొందుపర్చారు. సీట్స్ కు అదనపు అడ్జస్ట్ మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. హార్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, డ్రైవింగ్ అసిస్ట్, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బీఎండబ్ల్యూ హెడ్ అప్ డిస్ ప్లే, పార్కింగ్ అసిస్టెంట్.. మొదలైన సదుపాయాలు ఉన్నాయి. పవర్ ఫుల్ ఇంజన్, గ్రేట్ ఇంటీరియర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని పొందేలా బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ ను రూపొందించామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా హెడ్ విక్రమ్ పావా తెలిపారు.