Unclaimed deposits: పదేళ్లుగా ఆపరేట్ చేయని బ్యాంక్ ఖాతాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం-big change coming from june for unclaimed deposits in bank accounts ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Big Change Coming From June For Unclaimed Deposits In Bank Accounts

Unclaimed deposits: పదేళ్లుగా ఆపరేట్ చేయని బ్యాంక్ ఖాతాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu
May 20, 2023 03:18 PM IST

Unclaimed deposits: ఒకటికి మించిన బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండడం ఇప్పడు సాధారణంగా మారింది. ఏదో ఒక అవసరానికి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం, ఆ తరువాత అందులో లావాదేవీలు చేయకుండా వదిలేయడం సాధారణంగా అందరూ చేస్తుంటారు. అలా, పదేళ్ల పాటు ఆపరేట్ చేయని బ్యాంక్ ఖాతాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Unclaimed deposits: ఒకవేళ గత పదేళ్లుగా మీ బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాల్లో లావాదేవీలు జరపడం లేదా? ఆ ఖాతాల్లో కొంత డిపాజిట్ మిగిలి ఉందా?.. అయితే, మీ కోసమే ఈ వార్త. త్వరపడండి. వెంటనే ఆ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి, ఖాతాను మూసివేయడమో, మళ్లీ రీయాక్టివేట్ చేయడమో చేసుకోండి. ఎందుకంటే ఈ జూన్ 1 నుంచి ఆర్బీఐ (RBI) ఆయా ఖాతాలను అన్ క్లెయిమ్డ్ అకౌంట్స్ గా నిర్ధారించనుంది. ఆర్బీఐ (RBI) నిబంధనల ప్రకారం.. పదేళ్లుగా ఖాతాదారుల ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డిపాజిట్లను ‘అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ (unclaimed deposits)’ గా పేర్కొంటారు. అలాగే, మెచ్యూరిటీ అనంతరం 10 ఏళ్ల లోపు క్లెయిమ్ చేసుకోని టర్మ్ డిపాజిట్ల (term deposits) ను కూడా ‘అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ (unclaimed deposits)’ అంటారు. ఈ అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ (unclaimed deposits) పై ఆర్బీఐ (RBI) ‘ 100 డేస్ 100 పేస్ (100 Days 100 Pays)’ పేరుతో ఒక ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ఈ 100 రోజుల పీరియడ్ లో ఇలాంటి అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల (Unclaimed deposits) ను బ్యాంక్స్ సెటిల్ చేయనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Unclaimed deposits: ఆ డిపాజిట్లను ఏం చేస్తారు?

సాధారణంగా అన్ క్లెయిమ్డ్ గా ఉన్న డిపాజిట్ల (Unclaimed deposits) ను ఆర్బీఐ (RBI) నిర్వహించే ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (DEAF)’ కు బ్యాంకులు బదిలీ చేస్తాయి. అయితే, ఈ సంవత్సరం ఏప్రిల్ 23 న ఆర్బీఐ (RBI) ఒక ప్రకటన చేసింది. అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల (Unclaimed deposits) ను ఆయా ఖాతాల న్యాయబద్ధమైన యజమానులకు లేదా వారి చట్టబద్ధ వారసులకు అందజేసే చర్యలు చేపడ్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇందు కోసం ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ ను రూపొందిస్తామని వెల్లడించింది. ఆ తరువాత మే 12, 2023 న ‘100 Days 100 Pays’ ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అందువల్ల ఖాతాదారులు తమ అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల (Unclaimed deposits) పై ఆయా బ్యాంక్ లను సంప్రదించాలని ఆర్బీఐ (RBI) కోరింది.

WhatsApp channel