Best smartphones for 2023 : న్యూ ఇయర్​కి గిఫ్ట్​ ప్లాన్​ చేస్తున్నారా? ఈ స్మార్ట్​ఫోన్స్​ ఇవ్వండి!-best smartphones for 2023 from iphone 14 to google pixel start 2023 with a bang with these phones ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Best Smartphones For 2023: From Iphone 14 To Google Pixel, Start 2023 With A Bang With These Phones

Best smartphones for 2023 : న్యూ ఇయర్​కి గిఫ్ట్​ ప్లాన్​ చేస్తున్నారా? ఈ స్మార్ట్​ఫోన్స్​ ఇవ్వండి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 26, 2022 12:04 PM IST

Best smartphone For 2023 : న్యూ ఇయర్​కి.. మీకు ఇష్టమైన వారికి గిఫ్ట్​ ఇద్దామని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఓసారి ఈ స్మార్ట్​ఫోన్​ లిస్ట్​ చూడండి..

ఈ న్యూ ఇయర్​కి- ఈ స్మార్ట్​ఫోన్స్​ను​ గిఫ్ట్​ ఇచ్చేయండి!
ఈ న్యూ ఇయర్​కి- ఈ స్మార్ట్​ఫోన్స్​ను​ గిఫ్ట్​ ఇచ్చేయండి!

Smartphones as New Year gifts : ఇంకొన్ని రోజుల్లో 2022 ముగుస్తుంది. దేశంలో ఇప్పటికే న్యూ ఇయర్​ వైబ్స్​ మొదలైపోయాయి. ట్రావెలింగ్​, షాపింగ్​తో ప్రజలు బిజీబిజీగా గడపుతున్నారు. ఇంకొందరు.. తమకు ఇష్టమైన వారికి తీపి జ్ఞాపకంగా గిఫ్ట్​లు కొనాలని భావిస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? ఈ న్యూ ఇయర్​కి.. మీకు నచ్చిన వారికి స్మార్ట్​ఫోన్​ను గిఫ్ట్​గా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే.. మీకోసమే ఈ లిస్ట్​..​

ఐఫోన్​ 14 ప్రో:-

iPhone 14 Pro : ఐఫోన్​ 14 ప్రో కన్నా బెస్ట్​ గిఫ్ట్​ ఇంకేదైనా ఉంటుందా? ప్రీమియం స్మార్ట్​ఫోన్​ను మీరు గిఫ్ట్​గా ఇద్దామని అనుకుంటుంటే.. ఇదే ది బెస్ట్​! ప్రస్తుతం ఐఫోన్​ 14 ప్రో ధర రూ. 1,29,900గా ఉంది. ఇది గిఫ్ట్​గా ఇస్తే.. ఎవరైనా సరే మీ ప్రేమను అర్థం చేసుకోవాల్సిందే.

ఐఫోన్​ 13:-

iPhone 13 price :'ఐఫోన్​ 14 ప్రో ధర ఎక్కువగా ఉంది, తక్కువలో ప్రీమియం స్మార్ట్​ఫోన్​ ఉంటే బాగుంటుంది,' అని భావిస్తున్నారా? అయితే ఐఫోన్​ 13 మీకోసమే ఎదురుచూస్తోంది. ఫ్లిప్​కార్ట్​లో దీని ధర రూ. 65,999గా ఉంది. ఆఫర్లు, ఎక్స్​ఛేంజ్​లతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​22- అల్ట్రా:-

Samsung Galaxy S22 Ultra : ఫ్లిప్​కార్ట్​లో ఇయర్​ ఎండ్​ సేల్​ నడుస్తోంది. పలు ప్రీమియం సెగ్మెంట్​ స్మార్ట్​ఫోన్స్​పై మంచి డీల్స్​ లభిస్తున్నాయి. శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​ 22 అల్ట్రా.. ఈ వరుసలో ముందుంటుంది. దీని లాంచ్​ ప్రైజ్​ రూ. 1,09,999 కాగా.. ఇప్పుడు ఇది రూ. 99,888కే లభిస్తోంది. బ్యాంక్​ ఆఫర్స్​తో ధర మరింత తగ్గుతుంది.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​22 లాంచ్​ ప్రైజ్​ రూ. 72,999గా ఉంది. కానీ ఫ్లిప్​కార్ట్​ ఇయర్​ ఎండ్​ సేల్​లో ఇది కేవలం రూ. 52,900కే లభిస్తుండటం విశేషం.

గూగుల్​ పిక్సెల్​ 7:-

Google Pixel 7 offers : గూగుల్​ పిక్సెల్​ 7 8జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 59,999గా ఉంది. ఫెడరల్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​పై రూ. 3000 ఆఫర్​ లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 20,500 కూడా తగ్గుతుంది. మంచి డీల్​ కదూ..!

నథింగ్​ ఫోన్​ 1:-

నథింగ్​ ఫోన్​ 1 ప్రస్తుత ధర రూ. 27,499గా ఉంది. న్యూ ఇయర్​కి ఈ స్మార్ట్​ఫోన్​ కొనడం మంచి నిర్ణయం అవుతుంది!

అయితే.. కొన్ని స్మార్ట్​ఫోన్​ సంస్థలు 2023ని గ్రాండ్​గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జనవరి నుంచి పలు మోడల్స్​ లాంచ్​ అవ్వనున్నాయి. ఇప్పుడు కాకపోతే.. అప్పుడైనా మీరు న్యూ ఇయర్​ గిఫ్ట్​ను ప్లాన్​ చేసుకోవచ్చు!

WhatsApp channel

సంబంధిత కథనం