Apple shares hit lowest: అత్యంత కనిష్టానికి ‘యాపిల్’ షేర్లు-apple shares hit lowest since june 2021 on iphone supply concerns ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Apple Shares Hit Lowest Since June 2021 On Iphone Supply Concerns

Apple shares hit lowest: అత్యంత కనిష్టానికి ‘యాపిల్’ షేర్లు

HT Telugu Desk HT Telugu
Dec 27, 2022 10:41 PM IST

Apple shares hit lowest: పాపులర్ స్మార్ట్ ఫోన్ ‘ఐ ఫోన్’() తయారీ సంస్థ యాపిల్ కంపెనీ షేర్ విలువ మంగళవారం అత్యంత కనిష్టానికి దిగజారింది. 2021 జూన్ తరువాత ఈ స్థాయి కనిష్టానికి యాపిల్ షేర్ ధర తగ్గడం ఇదే ప్రథమం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

Apple shares hit lowest: యాపిల్ కంపెనీ(Apple Inc) షేర్ ధర మంగళవారం అత్యంత కనిష్టానికి దిగజారింది. అంతర్జాతీయ టెక్ కంపెనీల షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో వరుసగా మూడో రోజు యాపిల్ షేర్ ధర తగ్గింది. మంగళవారం ఒక్కరోజే యాపిల్ షేర్ వ్యాల్యూ 2.4% తగ్గింది. నాస్దాక్ 100 సూచీ (Nasdaq 100 Index) 0.8% తగ్గింది.

ట్రెండింగ్ వార్తలు

Apple shares hit lowest: 2022లో..

2022 సంవత్సరం మొత్తంగా ఇన్వెస్టర్లకు అసంతృప్తితోనే ముగిసింది. నాస్దాక్ 100 సూచీ (Nasdaq 100 Index) ఈ సంవత్సరం 33% తగ్గింది. అందుకు అనుగుణంగా, యాపిల్ సంస్థ షేర్ల విలువ కూడా 27% తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ భయాలు, తరుముకు వస్తున్న ఆర్థిక మాంద్యం టెక్ షేర్లపైననే కాకుండా, అన్ని సెక్టార్ల షేర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి.

Apple shares hit lowest: చైనా కోవిడ్ ప్రభావం

చైనాలో కోవిడ్ విజృంభణ కారణంగా ప్రస్తుతం హై డిమాండ్ ఉన్న యాపిల్ ఐ ఫోన్ 14(iPhone 14)మోడల్స్ సరఫరాకు అంతరాయం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. యాపిల్ ఉత్పత్తుల తయారీలో చైనాదే మెజారిటీ వాటా అన్న విషయం తెలిసిందే. ఐ ఫోన్(iPhone) సప్లై, డిమాండ్ ల మధ్య అంతరం తగ్గుతోందని, అయితే, అది ఆశించిన స్థాయిలో తగ్గడం లేదని జేపీ మోర్గాన్(JPMorgan) వెల్లడించింది. అలాగే, చైనా నుంచి వచ్చిన ఐ ఫోన్ షిప్ మెంట్ డేటా కూడా అంత సానుకూలంగా లేదని జేపీ మోర్గాన్ అనలిస్ట్ సామిక్ చటర్జీ వెల్లడించారు.

WhatsApp channel