TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి-telangana model school entrance exam 2024 results announced direct link are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
May 02, 2024 06:05 PM IST

Telangana Model School Admissions Updates: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల ఫలితాలు(TSMS Results 2024) విడుదలయ్యాయి. ఈ మేరకు వెబ్ సైట్ లో మార్కులతో పాటు ర్యాంక్ వివరాలను కూడా పొందుపరిచారు.

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు

Telangana Model School Entrance Exam 2024: తెలంగాణలో మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష(Telangana Model School Exam 2024)ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7వ తేదీన ఈ ఎగ్జామ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారులు విడుదల చేశారు. విద్యార్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంక్ ను కూడా వెబ్ సైట్ లో పొందుపరిచారు.

ఈ ప్రవేశ పరీక్ష(Telangana Model School Admissions) ద్వారా… 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీ చేస్తారు.ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు. https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లు(Telangana Model Schools) ఉన్నాయి. 6వ తరగతిలో మొత్తం 19,400 సీట్లను భర్తీ చేస్తారు. ఇక 7-10 తరగతుల్లోని మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి తరగతికి 2 సెక్షన్లు ఉంటాయి. సీట్లు సాధించిన విద్యార్థుల జాబితాను మే 25న ప్రకటిస్తారు.

TSMS Results 2024 : ఫలితాలను ఇలా చెసుకోవచ్చు

  • పరీక్ష రాసిన విద్యార్థులు https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో ఆరో తరగతితో పాటు 7 -10 తరగతి ప్రవేశాల నోటిఫికేషన్లు కనిపిస్తాయి.
  • ఆయా ఆప్షన్ల పక్కనే Know Your Merit అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి.
  • ఓపెన్ అయిన విండోలో మీ హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీతో పాటు Verification కోడ్ ను ఎంట్రీ చేాయాలి.
  • Get Results పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కూడా డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • ప్రవేశాల సమయంలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.

మోడల్ స్కూల్ పరీక్షా విధానం చూస్తే… మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయిస్తారు.

6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.పరీక్ష సమయం 2 గంటలుగా ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన స్కోర్, ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్ల కేటాయింపులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మార్కులు విడుదల

AP Model School Marks: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 164 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షల ఫలితాలను ఏపీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. https://cse.ap.gov.in/ లేదా https://apms.apcfss.in/StudentLogin.do వెబ్ సైట్లలో మార్కుల్ని అందుబాటులో ఉంచారు.

ఏపీ మోడల్ స్కూళ్లలో(AP Model School Admissions 2024) ఆరోతరగతి అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఏప్రిల్ 21న పరీక్ష నిర్వహించారు. 2024-25 విద్యా సంవత్సరంకు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(Model Schools)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21న అర్హత పరీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేసింది. విద్యార్ధులు సాధించిన మార్కుల ఆధారంగా వారు ఎంచుకున్న పాఠశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

IPL_Entry_Point