Vivah muhurtham: 23 ఏళ్ల తర్వాత మే, జూన్ నెలలో పెళ్లి ముహూర్తాలు లేవు.. దీనికి కారణం ఏమిటో తెలుసా?-after 23 years no vivah muhurtham in may and june months ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vivah Muhurtham: 23 ఏళ్ల తర్వాత మే, జూన్ నెలలో పెళ్లి ముహూర్తాలు లేవు.. దీనికి కారణం ఏమిటో తెలుసా?

Vivah muhurtham: 23 ఏళ్ల తర్వాత మే, జూన్ నెలలో పెళ్లి ముహూర్తాలు లేవు.. దీనికి కారణం ఏమిటో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Apr 30, 2024 03:32 PM IST

Vivah muhurtham: దాదాపు 23 ఏళ్ల తర్వాత మే, జూన్ నెలలో పెళ్ళికి ముహూర్తాలు లేవు. అందుకు కారణం గురు, శుక్ర గ్రహాలని పండితులు చెబుతున్నారు. మళ్ళీ ఎప్పుడు ముహూర్తాలు ఉన్నాయో తెలుసా?

ఈ రెండు నెలలు ముహూర్తాలు లేవు
ఈ రెండు నెలలు ముహూర్తాలు లేవు (pixabay)

Vivah muhurtham: పెళ్ళిళ్ళు వంటి శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు మరో రెండు నెలల పాటు ఎటువంటి ముహూర్తాలు లేవు. అందుకు కారణం రెండు పెద్ద గ్రహాల స్థితిలో మార్పు రావడమే. 

దాదాపు 23 ఏళ్ల తర్వాత మే, జూన్ నెలలో పెళ్లిళ్లకి శుభ ముహూర్తాలు లేవని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో శుభ గ్రహాలుగా భావించే శుక్రుడు, బృహస్పతి కదలికలో మార్పు రావడమే. ఎందుకంటే వివాహం జరిపించేందుకు ఈ రెండు గ్రహాలు శుభ స్థానంలో ఉండాలి. అవి అశుభ స్థానంలో ఉంటే ఏ విధమైన శుభకార్యాలు చేయడం శుభప్రదంగా పరిగణించరు. మళ్ళీ జులై నెలలోనే పెళ్లికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. 

రెండు గ్రహాలు అస్తంగత్వం 

మే 1న బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే మే 3న గురు గ్రహం అస్తంగత్వ దశలోకి వెళతాడు. మరికొద్ది రోజుల్లో సూర్యుడు కూడా వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. మే 19న శుక్రుడు వృషభ రాశి సంచారం చేస్తాడు. ఆ సమయంలో గురు, శుక్ర గ్రహాల సంయోగం జరుగుతుంది. శుక్రుడు కూడా కొన్ని రోజులకు అస్తంగత్వ దశలోకి వెళతాడు.  

సూర్యుడికి బృహస్పతి, శుక్రుడు దగ్గరగా ఉన్నప్పుడు వాటి శక్తి బలహీనమవుతుంది. ఫలితంగా ఇవి రెండు గ్రహాలు అస్తంగత్వ దశకు చేరుకుంటాయి. జులైలో శుక్రుడు ఉదయించిన తర్వాత మళ్ళీ ముహూర్తాలు ఉంటాయి. 

ప్రతి ఏడాది మే, జూన్ నెలలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈసారి ఈ రెండు నెలలో వివాహాలకు శుభప్రదమైన ముహూర్తాలు లేవు. బృహస్పతి మే 7 నుంచి జూన్ 6 వరకు నెల రోజుల పాటు అస్తంగత్వ దశలో ఉంటాడు.  అందువల్ల శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుకాదు. అలాగే శుక్రుడు జూన్ వరకు దహన స్థితిలో ఉంటాడు. రెండు నెలల తర్వాత జులైలో శుభకార్యాలు  నిర్వహించుకునేందుకు మంచి ముహూర్తాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సమయాన్ని మూఢం అంటారు. 

మళ్ళీ అప్పుడే ముహూర్తాలు 

జులై ఒక నెలలో కొన్ని రోజులు పాటు వివాహ ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత మూడు నెలల పాటు మళ్ళి శుభకార్యాలు జరిగేందుకు అనువైన ముహూర్తాలు లేవు. నవంబర్ 12న నుంచి వివాహాలు, శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు ముహూర్తాలు ఉన్నాయి. అందువల్ల జూలై తరువాత నవంబర్, డిసెంబర్ నెలలోనే పెళ్లిళ్లు జరిగేందుకు అవకాశం ఉందని పండితులు పేర్కొన్నారు. 

23 ఏళ్ల తర్వాత ఇలా  

2000 సంవత్సరంలో ఇలా మే, జూన్ నెలలో ముహూర్తాలు లేకుండా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చినట్టు పండితులు చెబుతున్నారు. పెళ్లి ముహూర్తాలు చూసే సమయంలో గురు, శుక్ర స్థానాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు. శుక్రుడు ఆనందానికి కారకుడు సంతోషాన్ని సూచిస్తాడు. బృహస్పతి వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తాడు. అందువల్ల శుభ వివాహానికి ఈ రెండు గ్రహాల శుభ స్థానాలు అవసరమని శాస్త్రాలు చెబుతున్నాయి. 2000 సంవత్సరంలో కూడా ఈ గ్రహాల స్థితి కారణంగా మే, జూన్ నెలలో వివాహ ముహూర్తాలు లేవు. 

 

 

WhatsApp channel