T20 World Cup: టీ20 వ‌ర‌ల్ట్ క‌ప్ లో టీమిండియా సెమీస్‌కు కూడా చేర‌దు - ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఫైర్-not india and pakistan michel vaughan reveals his favourite teams in t20 world cup ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup: టీ20 వ‌ర‌ల్ట్ క‌ప్ లో టీమిండియా సెమీస్‌కు కూడా చేర‌దు - ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఫైర్

T20 World Cup: టీ20 వ‌ర‌ల్ట్ క‌ప్ లో టీమిండియా సెమీస్‌కు కూడా చేర‌దు - ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఫైర్

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2024 09:34 AM IST

T20 World Cup: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా సెమీస్ కూడా చేరుకోవ‌డం క‌ష్ట‌మ‌ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. పాకిస్థాన్‌కు క‌ప్ గెలిచే సీన్ లేద‌ని చెప్పాడు.

టీమిండియా
టీమిండియా

T20 World Cup: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌రం మ‌రో నెల రోజుల్లో మొద‌లుకానుంది. ఈ పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఇండియా, ఆస్ట్రేలియాతో ప‌లు దేశాలు ఇప్ప‌టికే త‌మ టీమ్‌ల‌ను ప్ర‌క‌టించాయి. టీ20 స్పెష‌లిస్ట్‌లో అన్ని టీమ్‌లు బ‌లంగా క‌నిపిస్తోండ‌టంతో ఈ సారి వ‌ర‌ల్డ్ స‌మ‌రం పోటాపోటీగా సాగ‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. విన్న‌ర్‌గా ఎవ‌రు నిలుస్తారు? సెమీస్ చేరే టీమ్‌లు ఏవ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ నాలుగే ఫెవ‌రేట్‌...

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఫేవ‌రేట్ గా బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు పేర్కొన్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్‌ మైఖేల్ వాన్ మాత్రం టీ20 వ‌ర‌ల్డ్ ఫేవ‌రేట్ టీమ్‌ల‌పై భిన్న‌మైన అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. టీమిండియా సెమీస్ కూడా చేరుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అన్నాడు మైఖేల్ వాన్‌.

పాకిస్థాన్‌కు క‌ప్ గెలిచే సీన్ లేద‌ని తెలిపాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో పాటు వెస్టిండీస్ సెమీస్ చేరుకునే అవ‌కాశం ఉంద‌ని అన్నాడు. మైఖేల్ వాన్ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ నాలుగు టీమ్‌లు బ‌లంగా క‌నిపిస్తోన్నాయ‌ని, వీటిలోనే ఓ టీమ్ క‌ప్ గెలుస్తోంద‌ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టాడు.

ట్వీట్‌పై ట్రోల్స్‌...

మైఖేల్ వాన్‌ పోస్ట్‌పై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. ఇంగ్లండ్‌, సౌతాఫ్రికాతో పాటు వెస్టిండీస్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయ‌ని, ఓ గ్రూప్ నుంచి రెండు టీమ్‌లు మాత్ర‌మే సెమీస్ చేరుకుంటాయ‌ని, మూడు సెమీస్ వెళ్ల‌డం అసాధ్య‌మ‌ని అది కూడా తెలియ‌కుండా ఎలా ట్వీట్ చేస్తారంటూ మైఖేల్ వాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.

ఇండియా ఖ‌చ్చితంగా సెమీస్ చేరుకుంటుంద‌ని, క‌ప్ గెలిచే స‌త్తా భార‌త జ‌ట్టుకు ఉందంటూ రిప్లై ఇస్తున్నారు. నీ అంచ‌నా ఎప్పుడు క‌రెక్ట్ కాలేద‌ని, మ‌రోసారి కూడా నీ ప్రెడిక్ష‌న్‌ త‌ప్పు అని టీమిండియా నిరూపిస్తుంద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. మ‌రికొంద‌రు మాత్రం మైఖేల్ వాన్ అంచ‌నా నిజ‌మ‌య్యే ఛాన్స్ ఉంద‌ని, టీమిండియా టీమ్ సెల‌క్ష‌న్ బాగా లేదంటూ కామెంట్స్ పెడుతోన్నారు.

టీమ్‌ను అనౌన్స్ చేయ‌ని పాక్‌...

కాగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం టీమ్‌ల‌ను అనౌన్స్‌చేసేందుకు మే 1 వ‌ర‌కు ఐసీసీ గ‌డువు ఇచ్చింది. ఈ గ‌డువు లోగా ప్ర‌ధాన టీమ్‌లు అన్ని త‌మ తుది జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కు పాకిస్థాన్‌, శ్రీలంక‌, వెస్టిండీస్ తో పాటు బంగ్లాదేశ్‌ మాత్రం త‌మ టీమ్‌ల‌ను ప్ర‌క‌టించ‌లేక‌పోయాయి.

గాయాల కార‌ణంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఏ క్రికెట‌ర్లు అందుబాటులో ఉంటారో, ఎవ‌రు ఫిట్‌గా ఉన్నారో తేల్చుకోలేక‌పోవ‌డంతో ఈ నాలుగు టీమ్‌ల‌కు స‌మ‌స్య‌గా మారింది. ఈ నాలుగు టీమ్‌ల‌తో పాటు యూఎస్ఏ, నెద‌ర్లాండ్స్‌, స్కాట్లాండ్‌, ప‌పువా న్యూ గినియా లాంటి ప‌లు క్వాలిఫ‌య‌ర్ దేశాలు కూడా త‌మ టీమ్‌ల‌ను ప్ర‌క‌టించ‌లేదు. జ‌ట్ట‌లో మార్పులు చేర్పులు చేయ‌డానికి మే 25 వ‌ర‌కు అన్ని టీమ్‌ల‌కు ఐపీసీ అవ‌కాశం క‌ల్పించింది. ఐసీసీ అనుమ‌తితోనే ఈ మార్పులు చేయాల్సివుంటుంది.

వెస్టిండీస్‌, అమెరికా అతిథ్యం...

ఈ సారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు వెస్టిండీస్‌తో పాటు అమెరికా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. జూన్ 2 నుంచి జూన్ 29 వ‌ర‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నుంది. మొత్తం 20 దేశాలు పోటీప‌డ‌బోతున్నాయి.

IPL_Entry_Point