IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. కేకేఆర్‌దే బెస్ట్ నెట్ రన్‌రేట్.. ఢిల్లీకి ఇక కష్టమేనా?-ipl 2024 points table after kkr vs dc kkr with best net run rate remains in 2nd spot delhi capitals on 6th ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. కేకేఆర్‌దే బెస్ట్ నెట్ రన్‌రేట్.. ఢిల్లీకి ఇక కష్టమేనా?

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. కేకేఆర్‌దే బెస్ట్ నెట్ రన్‌రేట్.. ఢిల్లీకి ఇక కష్టమేనా?

Hari Prasad S HT Telugu
Apr 30, 2024 08:17 AM IST

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో కేకేఆర్, డీసీ మ్యాచ్ తర్వాత పెద్దగా మార్పులు జరగలేదు. ఈ జట్టు స్థానం మారకపోయినా.. కేకేఆర్ నెట్ రన్ రేట్ మాత్రం అన్ని జట్ల కంటే చాలా మెరుగ్గా ఉంది.

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. కేకేఆర్‌దే బెస్ట్ నెట్ రన్‌రేట్.. ఢిల్లీకి ఇక కష్టమేనా?
ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. కేకేఆర్‌దే బెస్ట్ నెట్ రన్‌రేట్.. ఢిల్లీకి ఇక కష్టమేనా? (ANI)

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న సమయంలో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ సమయంలో ఒక్కో గెలుపోటమి టీమ్స్ ప్లేఆఫ్స్ బెర్త్ ను శాసిస్తుంది. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో ఏ జట్టు స్థానం మారలేదు. అయితే కేకేఆర్ నెట్ రన్ రేట్ అన్ని జట్ల కంటే మెరుగ్గా ఉంది.

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్

ఢిల్లీ క్యాపిటల్స్ పై సునాయాస విజయంతో కేకేఆర్ పాయింట్ల టేబుల్లో తన రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో 6 విజయాలు, మూడు ఓటములతో 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అంతేకాదు నెట్ రన్ రేట్ విషయంలో మిగిలిన అన్ని జట్ల కంటే కేకేఆర్ మెరుగ్గా ఉంది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ ఏకంగా 1.096 కావడం విశేషం.

తొలి స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కంటే కూడా కేకేఆర్ నెట్ రన్ రేట్ బాగుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై భారీ విజయంతో ఇది మరింత మెరుగైంది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో పదేసి పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ (0.810), సన్ రైజర్స్ హైదరాబాద్ (0.075) ఉన్నాయి. ఐదు, ఆరు స్థానాల్లో లక్నో సూపర్ జెయిట్స్ (0.059), ఢిల్లీ క్యాపిటల్స్ (-0.442) ఉన్నాయి.

ఐపీఎల్ 2024 లేటెస్ట్ పాయింట్ల టేబుల్
ఐపీఎల్ 2024 లేటెస్ట్ పాయింట్ల టేబుల్

ఢిల్లీకి ఇక కష్టమేనా?

ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో ఉన్నా.. అన్నింటి కంటే ఎక్కువగా ఇప్పటికే 11 మ్యాచ్ లు ఆడేసింది. మరో మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ మూడూ గెలిచినా వాళ్ల ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుందన్న గ్యారెంటీ లేదు. వాళ్ల నెట్ రన్ రేట్ మెరుగ్గా లేదు. పైగా ఇప్పటికే రాజస్థాన్ 8 విజయాలతో 16 పాయింట్లతో ఉంది. రెండు నుంచి ఐదు స్థానాల వరకు ఉన్న కేకేఆర్, సీఎస్కే, సన్ రైజర్స్, లక్నో టీమ్స్ మరో ఐదేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

ఈ టీమ్స్ ఆ ఐదు మ్యాచ్ లలో మూడు గెలిచినా ఢిల్లీని సమం చేస్తాయి. పైగా వాటి నెట్ రన్ రేట్ ఢిల్లీ కంటే బాగుంది. దీంతో ఏ రకంగా చూసుకున్నా క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరడం అంత సులువుగా కనిపించడం లేదు. ఇక ఢిల్లీ తర్వాత గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీతోపాటు ఆ కింద ఉన్న జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే వాళ్లు మిగిలిన మ్యాచ్ లలో విజయాలు సాధించడంతోపాటు మరికొన్ని ఇతర మ్యాచ్ ల ఫలితాలు కూడా వాళ్లకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔటైనట్లే చెప్పాలి. ఈ నేపథ్యంలో మంగళవారం (ఏప్రిల్ 20) లక్నో, ముంబై మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో లక్నో గెలిస్తే ఇక ముంబై పని కూడా అయిపోయినట్లే.

IPL_Entry_Point