Happy Birthday Rohit Sharma: హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ.. మన తెలుగు వాడైన టీమిండియా కెప్టెన్ గురించి ఈ విషయాలు తెలుసా?-happy birth day rohit sharma team india captain rohit knows telugu well know these things about him ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Happy Birthday Rohit Sharma: హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ.. మన తెలుగు వాడైన టీమిండియా కెప్టెన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Happy Birthday Rohit Sharma: హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ.. మన తెలుగు వాడైన టీమిండియా కెప్టెన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Hari Prasad S HT Telugu
Apr 30, 2024 08:44 AM IST

Happy Birthday Rohit Sharma: మన తెలుగు వాడైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం (ఏప్రిల్ 30) తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతని గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయాలు ఇవే.

హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ.. మన తెలుగు వాడైన టీమిండియా కెప్టెన్ గురించి ఈ విషయాలు తెలుసా?
హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ.. మన తెలుగు వాడైన టీమిండియా కెప్టెన్ గురించి ఈ విషయాలు తెలుసా? (PTI)

Happy Birthday Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ అనే ట్యాగ్ నుంచి సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఎదిగిన రోహిత్ శర్మ 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. క్లాస్ తోపాటు పవర్ హిట్టింగ్ కూడా సొంతమైన రోహిత్ ఓ తెలుగు వాడు అన్న విషయం ఎంత మందికి తెలుసు? అంతేకాదు అతని గురించి ఇప్పటి వరకూ చాలా మందికి తెలియని విశేషాలను ఇప్పుడు అతని బర్త్ డే సందర్భంగా తెలుసుకుందాం.

రోహిత్ మన తెలుగు వాడే

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మన తెలుగు వాడే. అతని తల్లి పూర్ణిమా శర్మది మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం. తండ్రి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. దీంతో రోహిత్ కు మరాఠీయే మాతృభాష అయినా.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ కూడా బాగా వస్తుంది.

రోహిత్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో ఏప్రిల్ 30, 1987లో జన్మించాడు. రోహిత్ తండ్రి పేరు గురునాథ్ శర్మ. రోహిత్ కు ఓ తమ్ముడు విశాల్ శర్మ కూడా ఉన్నాడు.

రోహిత్ గురించి తెలియని విషయాలు ఇవే

- రోహిత్ శర్మ తండ్రి ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పని చేసేవాడు. అయితే అర్ధంతరంగా అతని ఉద్యోగం పోవడంతో కుటుంబ భారాన్ని రోహిత్ మోయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అతడు ఇండియన్ ఆయిల్ కంపెనీతోపాటు రంజీ ట్రోఫీ కూడా ఆడుతూ కుటుంబాన్ని పోషించాడు.

- రోహిత్ శర్మ క్రికెట్ ఆడటం అతని తల్లి పూర్ణిమకు అసలు ఇష్టం లేదు. ఓ మంచి సంస్థలో పర్మనెంట్ ఉద్యోగిగా అతన్ని చూడాలని అనుకుంది. కానీ రోహిత్ మాత్రం తన లక్ష్యాలపైనే దృష్టి సారించి ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్ గా ఎదిగాడు.

- రోహిత్ తన క్రికెట్ కెరీర్ ను ఓ ఆఫ్ స్పిన్నర్ గా మొదలు పెట్టాడు. దినేష్ ల్యాడ్ అనే వ్యక్తిని చూసి అతడు స్ఫూర్తి పొందాడు. అతడు తన ముంబై టీమ్మేట్ సిద్ధేష్ ల్యాడ్ తండ్రి.

- ఒక సమయంలో స్కూలు ఫీజు కట్టడానికి కూడా రోహిత్ శర్మ దగ్గర డబ్బులు లేవన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే అతని క్రికెట్ టాలెంట్ ను గుర్తించిన స్కూలు యాజమాన్యం స్కాలర్షిప్ ఇచ్చి అతన్ని ప్రోత్సహించింది.

- తన క్రికెట్ ఐడల్ వీరేంద్ర సెహ్వాగ్ ఆట చూడటానికి రోహిత్ తన స్కూల్ కు డుమ్మా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి.

- వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ రోహిత్ శర్మ. మొదట సౌరవ్ గంగూలీ 2003 వరల్డ్ కప్ సెమీఫైనల్లో కెన్యాపై సెంచరీ చేశాడు.

- వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మనే.

- క్రికెట్ కాకుండా రోహిత్ శర్మకు ఫుట్‌బాల్ అంటే కూడా చాలా ఇష్టం. అతడు రియల్ మాడ్రిడ్ క్లబ్ కు వీరాభిమాని. అతడు రెగ్యులర్ గా ఫుట్‌బాల్ ఫాలో అవుతాడు.

IPL_Entry_Point