AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్-election effect salaries and service pensions of employees on may 1st ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Sarath chandra.B HT Telugu
May 01, 2024 01:39 PM IST

AP Govt Salaries: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడ్డాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో ఒకటో తేదీన సొమ్ము జమైంది.

ఏపీలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు వచ్చేశాయి....
ఏపీలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు వచ్చేశాయి.... (REUTERS)

AP Govt Salaries: అమ్మో ఒకటో తారీకు అనుకుంటూ భయపడే AP ప్రభుత్వ ఉద్యోగులకు మే 1 తేదీ బ్యాంకులకు సెలవు రోజైనా ఖాతాల్లో Salaries జీతాలు మాత్రం జమ అయ్యాయి.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల Govt Employees జీతాల చెల్లింపుకు గత కొన్నేళ్లుగా జాప్యం జరుగుతోంది. నవరత్నాల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలకు నగదు బదిలీ చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.

సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి నెల ఒకటో తేదీన లబ్దిదారులకు  pensionsపెన్షన్ల నగదును పంపిణీ చేసేవారు. ఇతర నగదు బదిలీ పథకాలు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల జీతాల చెల్లింపుకు తర్వాత స్థానం ఇచ్చింది.

వైసీపీ  YCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కోవిడ్ ముంచుకు రావడం, దాదాపు రెండేళ్ల పాటు దాని ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో రాష్ట్రం ఆర్ధికంగా తీవ్ర ఒడిదడుకుల్ని ఎదుర్కొన్నా నగదు బదిలీ పథకాలు, నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు మాత్రం కొనసాగాయి. ఈ క్రమంలో జీతాలు, పెన్షన్ల చెల్లింపు గణనీయంగా ఆలస్యమయ్యేది.

ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఆలస్యం కావడంతో గ్రూప్‌ సి,డి ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెన్షనర్లు కూడా ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయోనని పడిగాపులు పడాల్సి వచ్చేది. గత ఆర్నెల్లుగా పెన్షనర్లకు మాత్రం సకాలంలో నగదు జమ చేస్తున్నారు.

ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్‌...

రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాలు, పాత పథకాలకు నగదు బదిలీలకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు లేకపోవడం, ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పాలన సాగుతుండటంతో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీతాలను చెల్లిస్తున్నారు.

ఏపీలో 15లక్షల మంది ఉద్యోగులు...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 14.76లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 4,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో లక్షా 28వేల మం్ది ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వంలో విలీనమైన ఏపీఎస్‌ ఆర్టీసీలో 53వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు అందుకున్న వారు ఆరులక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

ఏపీలో సర్వీస్ పెన్షనర్లు 3.58లక్షల మంది ఉన్నారు. సర్వీస్ పెన్షన్లపై ఆధారపడి ఫ్యామిలీ పెన్షన్ అందుకునే వారు మరో లక్ష మంది ఉన్నారు. ఇలా ప్రభుత్వ పెన్షనర్లు 4.58లక్షల మంది ఉన్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్షా 20వేల మంది వరకు ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు 80వేల మంది, అంగన్‌ వాడీ వర్కర్లు, సహాయకులు మరో లక్షమంది ఉన్నారు. హోమ్‌ గార్డులు 15వేల మంది ఉన్నారు. మొత్తం అన్ని శాఖల్లో కలిపి 14,76వేల మంది ప్రభుత్వం నుంచి జీతాలు, పెన్షన్లు అందుకుంటున్నారు.

ఏప్రిల్‌‌లోనే కొన్ని బకాయిలు క్లియర్..

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెల ఉద్యోగులకు జీతాలకు రూ.3700-3800కోట్లు ఖర్చు అవుతుంది. ఏప్రిల్ నెలలో పాతబకాయిల్లో కొంత మొత్తం విడుదల చేశారు. ఒక సరెండర్‌ లీవులకు వేతనం చెల్లించారు. దీంతో శాలరీ బిల్లు కోసం రూ.5681కోట్లను జీతాల చెల్లింపుకు ఖర్చు చేశారు. సాధారణ చెల్లింపుల కంటే దాదాపు రూ.2వేల కోట్లను జీతాల కోసం చెల్లించారు.

మే నెలలో కూడా ఒకటో తేదీన జీతాలు చెల్లించారు. పెన్షనర్లకు ఏప్రిల్‌లో మెడికల్‌ బిల్లులతో కలిపి చెల్లించారు. ఇందకు రూ.1846కోట్లు చెల్లించారు. మే నెలలో దాదాపు రూ.1600-1700కోట్లను సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్లకు చెల్లించారు. మరో రూ.300-400కోట్లను గ్రాంట్ ఇన్‌ ఎయిడ్‌ జీతాలకు చెల్లిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు ఈ ఫండ్ నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. మరో వైపు ఆర్థిక సంవత్సరం మొదలైన తొలి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.10వేల కోట్లను అప్పులు చేసినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం...

ఒకటో తేదీన జీతాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక సతమతం అయ్యేవారిమని, నెలవారీ ఖర్చులకు డబ్బులు కూడా ఉండేవి కాదని గుర్తు చేస్తున్నారు.

ప్రభుత్వాల పాలన కంటే ఎన్నికల సంఘం పర్యవేక్షక పాలనే బాగుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌ జూన్‌ మొదటి వారం వరకు కొనసాగనున్న నేపథ్యంలో జూన్‌ నెల పెన్షన్లు, జీతాలు కూడా ఒకటో తేదీన పడతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం